Social Welfare
జాతీయ జల పురస్కారాలు: భారతదేశ నీటి పరిరక్షణ యోధుల వేడుక
प्रविष्टि तिथि:
18 NOV 2025 18:48 PM
కీలకాంశాలు
- జల్‌శక్తి అభియాన్, ప్రధానమంత్రి కృషి సంచాయీ ఓజన, వంటి కార్యక్రమాలు భారతదేశ నీటి భద్రతను బలోపేతం చేశాయి.
- ఆవిష్కరణలను, సమాజ-ఆధారిత జల సంరక్షణను ప్రేరేపించేందుకు 10 విభాగాల్లో 46 మంది విజేతలకు జాతీయ జల పురస్కారాలు దక్కాయి.
- జాతీయ జల పురస్కారాలతో పాటు దేశవ్యాప్తంగా అత్యుత్తమ సమాజ-ఆధారిత నీటి సంరక్షణ కార్యక్రమాలకు మొదటి జల్ సంచాయ్ జన్ భాగీదారీ(జేఎస్‌జేబీ) పురస్కారాల-2025 ప్రదానం జరిగింది.
సంరక్షణ సమష్టి ఉద్యమంగా మారితే..
భారతదేశ వారసత్వం, సౌభాగ్యం, పురోగతికి నీరు ఎప్పుడూ కీలకమే. సుస్థిర, దృఢమైన భవిష్యత్తును రూపొందించుకోవడంలో నీటి వనరులకు విలువనివ్వడం, పునరుద్ధరణకు కృషి చేయడం గతంలో కంటే ఎక్కువ కీలకమని భారత్ గుర్తించింది. ఈ సంకల్ప మార్గదర్శకత్వం మేరకు నీటి వినియోగాన్ని తెలివిగా, వినూత్నంగా మార్చేందుకు ఉమ్మడి నిబద్ధతతో పౌరులు, సమాజం, సంస్థలను ఏకం చేస్తూ ఒక సామూహిక ప్రయత్నాన్ని భారత్ స్వీకరించింది. నీటి నిర్వహణలో అత్యుత్తమ కృషిని వేడుకగా జరుపుకోవాల్సిన, ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తిస్తే 2018లో జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది.
నీటి సంరక్షణలో ఆవిష్కరణ, నాయకత్వం, నిబద్ధతను చాటిన వ్యక్తులు, సంస్థలు, రాష్ట్రాలను గౌరవించే వేదికగా ఈ పురస్కారాల రూపకల్పన జరిగింది. బాధ్యతాయుతమైన నీటి వినియోగ ఆవశ్యకతను ఈ కార్యక్రమం గుర్తించింది. నీటి వనరుల సంరక్షణ, పునరుజ్జీవంలో సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రచార, అవగాహన, క్షేత్రస్థాయి కార్యక్రమాల ద్వారా ఈ ప్రచారం వ్యక్తులు, గృహాలు, సంస్థాగత స్థాయిలో ప్రవర్తనా మార్పును ప్రేరేపించడానికి ప్రయత్నిస్తోంది.
జాతీయ జల పురస్కారాలకు శక్తినిస్తున్న దార్శనికత
నీటి సంరక్షణ, సమృద్ధ జలాలతో కూడిన భారత్ కోసం జల్ సమృద్ధ్ భారత్ దార్శనికతకు దేశాన్ని చేరువ చేయడానికి వారధులుగా ఉపయోగపడుతున్న వ్యక్తులు, సంస్థల అసాధారణ సేవలను జాతీయ జల పురస్కారాలు(ఎన్‌డబ్ల్యూఏ) వెలుగులోకి తీసుకొస్తున్నాయి. ఈ కార్యక్రమం కేవలం ఒక గుర్తించే వేడుక అనే దాని కంటే ఎక్కువగా నీటి సంరక్షణలో ఆవిష్కరణ, నిబద్ధత, సమాజ ఆధారిత కార్యచరణ పట్ల ప్రభుత్వ అంకితభావాన్ని ఈ పురస్కారాలు ప్రతిబింబిస్తున్నాయి.
మార్పునకు ఉత్ప్రేరకంగా రూపొందించిన ఈ అవార్డుల లక్ష్యం ప్రజల్లో నీటి విలువ పట్ల అవగాహనను పెంచడం, సుస్థిర, సమర్థవంతమైన నీటి వినియోగ విధానాలను అమలును ప్రేరేపించడం. విభిన్న భాగస్వాములను ఉమ్మడి లక్ష్యంతో ఒకే చోటకు చేరుస్తున్న ప్రత్యేకమైన వేదికగా ఈ వార్షిక కార్యక్రమం పనిచేస్తోంది. నీటి సంరక్షణ అనేది కేవలం ఒక ప్రయత్నం కాదు, ఇది ఒక సామూహిక కృషి అనే ఆలోచనను ఇది బలపరుస్తోంది. బలమైన భాగస్వామ్యాల ఏర్పాటుకు, పరస్పర అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి, నీటి వనరుల నిర్వహణ, సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఈ సమావేశం సహాయపడుతోంది.
2024 సంవత్సరానికి 6వ జాతీయ జల పురస్కారాలు అధికారికంగా 2024 అక్టోబర్ 23న ప్రారంభమయ్యాయి. ఈ పురస్కారాల కోసం 751 దరఖాస్తులు రాగా, 10 విభిన్న విభాగాల్లో ఉమ్మడి పురస్కారగ్రహీతలు సహా 46 విజేతలుగా నిలిచారు. 2025 నవంబర్ 18న అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఉత్తమ రాష్ట్రం విభాగంలో మహారాష్ట్ర తొలి ర్యాంకు సాధించగా, గుజరాత్ రెండోస్థానంలో, హర్యానా మూడో స్థానంలో నిలిచింది.

పురస్కారగ్రహీతల మొత్తం జాబితా చూసేందుకు ఈ కింద లింక్‌ను చూడండి:
జల్ సంచాయ్ జన్ భాగీదారీ(జేఎస్‌జేబీ) పురస్కారాలు
జల్ శక్తి అభియాన్: క్యాచ్ ది రెయిన్ ప్రచార కార్యక్రమం కింద సమాజ-ఆధారిత నీటి సంరక్షణకు చేసిన అత్యుత్తమ ప్రయత్నాలను గౌరవించేందుకు 2024లో జల్ సంచాయ్ జన్ భాగీదారీ పురస్కారాలు ప్రారంభమయ్యాయి. వివిధ రంగాల్లో 100 మంది సేవలను గుర్తించడం ద్వారా ఈ కార్యక్రమం భూగర్భ జలాల పునరుద్ధరణ, దీర్ఘకాలిక నీటి భద్రత కోసం విస్తరించదగిన నమూనాలను ప్రోత్సహిస్తోంది. జేఎస్‌జేబీ ప్రచారం కింద 35 లక్షల భూగర్హ జలాల పునరుద్ధరణ నిర్మాణాలు జరిగాయి. పౌరులు, భాగస్వాములు, స్థానిక సంస్థల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది.
- ఇంకుడుగుంతల నిర్మాణం ద్వారా నీటి సంరక్షణలో సమాజ భాగస్వామ్యాన్ని జేఎస్‌జేబీ ప్రోత్సహించడంతో లక్ష్యాలకు మించి ఫలితాలు వచ్చాయి.
- ఈ ఏడాది రాష్ట్రాలు, జిల్లాలు, మున్సిపాలిటీలు, ఎన్‌జీఓలు, పరిశ్రమలు, సమాజ సేవకులు, అధికారుల మొత్తం 100 పురస్కారాలు దక్కాయి.
ఉత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
మొదటి ర్యాంకు తెలంగాణ
రెండో ర్యాంకు ఛత్తీస్‌గఢ్
మూడో ర్యాంకు రాజస్థాన్
పురస్కార గ్రహీతల పూర్తి జాబితాను కింద లింక్‌లో చూడండి:
నీటి భద్రత కలిగిన భారతదేశ భవిష్యత్తుకు రూపం
భవిష్యత్తులో నీటి భద్రతను బలోపేతం చేసుకునేందుకు, ఆటుపోట్లను తట్టుకునేలా మార్చేందుకు, దేశవ్యాప్తంగా ప్రజలకు సుస్థిరంగా అందుబాటులో ఉంచేందుకు భారత్ విస్తృతస్థాయిలో పరివర్తనాత్మక కార్యక్రమాలు చేపడుతోంది.
జల్‌శక్తి అభియాన్: క్యాచ్ ది రెయిన్: దేశవ్యాప్త నీటి సంరక్షణ కార్యక్రమంగా జల్‌శక్తి అభియాన్: క్యాచ్ ది రెయిన్ 2021లో ప్రధానమంత్రి ప్రారంభించారు. “క్యాచ్ ది రెయిన్, ఎక్కడ కురుస్తుందో, ఎప్పుడు కురుస్తుందో” అనేది ఈ కార్యక్రమ నినాదం. నీటి వనరుల నుంచి పూడిక తీయడం, అటవీ పెంపకం, చెక్‌డ్యామ్‌లు, ఇంకుడు గుంతలు నిర్మించడం వంటి కార్యకలాపాల ద్వారా వర్షపునీటి సంరక్షణ, సుస్థిర నీటి నిర్వహణను ఈ కార్యక్రమం నొక్కి చెబుతోంది.
అటల్ భుజల్ యోజన: 2019లో ప్రారంభమైన సమాజ-ఆధారిత, భాగస్వామ్య భూగర్భ జల నిర్వహణ పథకం ఇది. 7 రాష్ట్రాల్లో నీటి కొరత ఉన్న 8,203 గ్రామ పంచాయతీల్లో ఈ పథకం అమలవుతోంది. ఈ పథకం కింద 81,000 నీటి సరఫరా నిర్మాణాలు జరిగాయి. భూగర్భ జలాల సంరక్షణ, ఇంకుడు గుంతల పునరుద్ధరణ జరిగింది. తద్వారా సమర్థ నీటి వినియోగ పద్ధతుల కిందకు దాదాపు 9 లక్షల హెక్టార్లు వచ్చాయి.
ప్రధానమంత్రి కృషి సంచాయీ యోజన: వ్యవసాయంలో నీటి వినయోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, విశ్వసనీయమైన నీటి పారుదల ఉండేలా చూడటం, పంట ఉత్పత్తిని పెంపొందించడం ఈ పథకం లక్ష్యాలు. “హర్ ఖేత్ కో పాని”, “మోర్ క్రాప్ పర్ డ్రాప్” సంకల్పంతో ఈ పథకం పనిచేస్తోంది. నీటి పారుదలను విస్తరణ, సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించడం, నీటి వనరుల సమీకృత వినియోగం, పంపిణీకి ఈ పథకం దోహదపడుతోంది.
అమృత్ 2.0: అన్ని పట్టణాల్లో అందరికీ నల్లా నీటి సరఫరా ఇవ్వడం ద్వారా నీటి భద్రత కలిగిన, స్వయం సమృద్ధ నగరాల ఏర్పాటు, 500 అమృత్ నగరాల్లో పూర్తిస్థాయిలో మురుగునీటి పారుదల, నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు అటల్ మిషర్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్‌మేషన్(అమృత్) పథకం లక్ష్యాలు. ఈ పథకం కింద రూ.1,14,220.62 కోట్లతో 3,568 నీటి సరఫరా ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. 181 లక్షల కొత్త నల్లా కనెక్షన్లకు మంజూరయ్యాయి.
జల్ జీవన్ మిషన్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ ఇంటికి నల్లా నీటిని సరఫరా చేసే లక్ష్యంతో 2019లో జల్ జీవన్ మిషన్ పథకం ప్రారంభమైంది. ఇప్పటివరకు 12.50 కోట్ల ఇళ్లకు కొత్త నల్లా కనెక్షన్లు ఇవ్వడం ద్వారా దేశంలో వేగంగా జరుగుతున్న గ్రామీణ మౌలిక వసతుల విస్తరణలో ఒకటిగా ఈ పథకం నిలిచింది. ఈ పథకం భూగర్భ జలాల పునరుద్ధరణ, వాడేసిన నీటి నిర్వహణ, నీటి సంరక్షణ, వర్షపునీటి సంరక్షణను ప్రోత్సహిస్తోంది.
ముగింపు
జాతీయ జల పురస్కారాలు కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాకుండా ఒక దార్శనికతతో కూడినవి. దేవవ్యాప్తంగా ఆలోచనాత్మక, ప్రభావవంతమైన నీటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఒక ఉద్యమం లాంటిది. రాష్ట్రాలు, జిల్లాలు, సంస్థలు, పరిశ్రమలు, వ్యక్తుల కృషిని గౌరవించడం ద్వారా ఈ అవార్డులు నీటి సంరక్షణ, నిర్వహణను రోజువారీ జీవితం, పాలనలో వివిధ రకాలుగా ఎలా ఏకీకృతం చేయవచ్చో చాటి చెప్తున్నాయి. ముఖ్యంగా, నీటిని కేవలం వనరుగా మాత్రమే కాకుండా జాతీయ పురోగతికి అవసరమైన భాగస్వామ్య వారసత్వంగా విలువ ఇచ్చే అవగాహనను ఈ పురస్కారాలు పెంపొందిస్తున్నాయి. ఈ అవార్డుల ద్వారా గుర్తింపు పొందిన కార్యక్రమాలు.. సామూహిక నిబద్ధత అనేది సవాళ్లను అవకాశాలుగా ఎలా మార్చగలదో ప్రదర్శిస్తాయి. నీటి సంరక్షణ యోధులను గౌరవించడం ద్వారా ఈ అవార్డులు ఇతరులను కూడా ఈ ప్రయాణంలో చేరడానికి ప్రేరేపిస్తాయి. తద్వారా భారతదేశ అభివృద్ధి, నీటి భద్రత గాథతో విడదీరయాని బంధాన్ని కలిగి ఉండేలా చూస్తాయి. ప్రభావవంతమైన నీటి నిర్వహణ సాధ్యమని చెప్పడంతో పాటు ఇప్పటికే జరుగుతోంది ఇవి రుజువు చేస్తున్నాయి.
References New Track
Ministry of Jal Shakti
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2188704
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2188706
https://www.mygov.in/campaigns/national-water-awards/
https://www.myscheme.gov.in/schemes/nwa
https://jsactr.mowr.gov.in/Website/index.aspx
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2147817
https://cgwb.gov.in/en/pmksy-hkkp-ground-water#:~:text=Pradhan%20Mantri%20Krishi%20Sinchayee%20Yojana,2019
https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=2182568
https://ejalshakti.gov.in/jjmreport/JJMIndia.aspx
Press Information Bureau
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?id=154737&NoteId=154737&ModuleId=3
Click here to see pdf
***
(तथ्य सामग्री आईडी: 150471)
आगंतुक पटल : 12
Provide suggestions / comments