ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నారీశక్తి సాధికారత, మహిళా ప్రాతినిధ్యం పెంపు పట్ల తమ దృఢ నిబద్ధతను పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 28 NOV 2026 2:15PM by PIB Hyderabad

పార్లమెంటులో, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మరింత రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పిస్తామన్న హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని ప్రధానమంత్రి ఈ రోజు పునరుద్ఘాటించారు.

రాబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో… ప్రధానమంత్రి సోషల్ మీడియాలో ‘ఎక్స్’ వేదికగా ఒక వీడియో సందేశాన్ని పంచుకున్నారు. మహిళా రిజర్వేషన్ల ఆకాంక్ష దశాబ్దాలుగా ఉందనీ... దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళలు లేఖల ద్వారా, ప్రత్యక్ష సంభాషణల ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందనీ, దేశవ్యాప్తంగా 'నారీ శక్తి' దీనికి మద్దతునిస్తోందని ఆయన తెలిపారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

 “మన 'నారీ శక్తి'కి మేం మాట ఇచ్చాం... దానిని నెరవేర్చడానికీ మేం కట్టుబడి ఉన్నాం...”


(రిలీజ్ ఐడి: 2343485) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , Khasi , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Malayalam