నాడు పోస్టు చేయడమైనది:
29 NOV 2026 9:50AM by PIB Hyderabad
జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్‌గఢ్ జిల్లాలో సంభవించిన ప్రమాదంలో ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ- ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
అలాగే, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.
ఈ ఉదంతంపై ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఘోర దుర్ఘటన ఉదంతం నన్నెంతో కలచివేసింది. ఇంతటి విషాద సమయంలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అలాగే, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 వంతున పరిహారం అందుతుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు తెలిపింది.
***