నాడు పోస్టు చేయడమైనది:
24 NOV 2026 6:07PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో జర్మనీ రిపబ్లిక్ ఛాన్సలర్ మాననీయ ఫ్రెడ్రిక్ మెర్జ్ ఫోన్ ద్వారా సంభాషించారు.
భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిని ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు సమీక్షించారు. అలాగే, ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ వేగంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఈ సంవత్సరం 75 ఏళ్లు నిండుతున్న నేపథ్యంలో అత్యాధునిక సాంకేతికతలు సహా కీలక రంగాలలో సహకార విస్తరణపై తమ నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. భారత్-ఐరోపా సమాఖ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ద్వైపాక్షిక వాణిజ్యం-పెట్టుబడుల విస్తరణకు కొత్త అవకాశాలకు బాటలు పడతాయని అభిప్రాయపడ్డారు.
పరస్పర ఆసక్తి గల ప్రాంతీయ-అంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను వారిద్దరూ పంచుకున్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, నియమాధారిత అంతర్జాతీయ వ్యవస్థకు మద్దతుపై సంయుక్త కృషిపై వారు అంగీకారానికి వచ్చారు. సమకాలీన ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో బహుపాక్షిక వేదికలపై నిరంతర సహకారం ప్రాధాన్యంపైనా వారు ఏకీభిప్రాయం వెలిబుచ్చారు.
***