ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నైపుణ్యాభివృద్ధికి, ప్రధాన ఉద్యోగ మార్గంగా నైపుణ్యాన్ని మార్చడానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యం గురించి తెలియజేసే కథనాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 24 NOV 2026 2:42PM by PIB Hyderabad

నైపుణ్యాభివృద్ధికి, ప్రధాన కెరీర్ మార్గంగా నైపుణ్యాలను మార్చడానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యం గురించి కేంద్ర సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌధరి రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

త్వరలో జరగబోయే వరల్డ్ స్కిల్స్ ఆసియా-2027 గురించి, ఐటీఐలను ఆధునికీకరించే పీఎం-సేతు కార్యక్రమం గురించి, పారిశ్రామిక అనుసంధానంతో కూడిన శిక్షణను బలోపేతం చేసే ప్రయత్నాల గురించి శ్రీ జయంత్ చౌధరి తెలియజేశారు. ఈ కార్యక్రమాలు ఏఐ యుగంలో పుట్టుకొస్తున్న నూతన అవకాశాలకు తగిన విధంగా యువతను ఎలా సన్నద్ధం చేస్తున్నాయో వివరించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం పోస్టు:

‘‘తన  నైపుణ్య ప్రయాణాన్ని ప్రపంచ వేదికపైకి భారత్ తీసుకెళుతోంది!

నైపుణ్యాభివృద్ధికి, ప్రధాన కెరీర్ మార్గంగా నైపుణ్యాలను మార్చేందుకు దేశం ఇస్తున్న ప్రాధాన్యం గురించి  కేంద్ర సహాయ మంత్రి శ్రీ @jayantrld రాశారు. త్వరలో జరగబోయే వరల్డ్ స్కిల్స్ ఆసియా-2027, ఐటీఐలను మెరుగుపరిచేందుకు  అమలు చేస్తున్న పీఎం-సేతు, పారిశ్రామిక అనుసంధానంతో కూడిన శిక్షణను బలోపేతం చేసే ప్రయత్నాల గురించి ఆయన తెలియజేశారు. అలాగే ఏఐ యుగంలో లభిస్తున్న అవకాశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు యువతను ఎలా సన్నద్ధం చేస్తున్నాయో కూడా వివరించారు.’’

***


(రిలీజ్ ఐడి: 2340875) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Khasi , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil , Malayalam