బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు-లిగ్నైట్ గనుల మైనింగ్ ప్రణాళిక.. గని మూసివేత ప్రణాళిక తయారీపై బొగ్గు మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు-2026 జారీ

నాడు పోస్టు చేయడమైనది: 23 NOV 2026 6:48PM by PIB Hyderabad

   బొగ్గు-లిగ్నైట్ గనుల కోసం మైనింగ్ ప్రణాళిక, గని మూసివేత ప్రణాళిక తయారీకి మార్గదర్శకాలు-2026”ను బొగ్గు మంత్రిత్వశాఖ జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన జారీచేసిన ఈ మార్గదర్శకాలు 30 రోజుల్లోగా అమలులోకి వస్తాయి. క్రమబద్ధ, శాస్త్రీయ గని ప్రణాళికలు, మూసివేత దిశగా ఫలితాధారిత చట్రానికి ఇవి తోడ్పడతాయి. ఇప్పటికే గల చట్టబద్ధ చట్రానికి ఇది అనుబంధంగా ఉంటూ, ఇతర చట్టబద్ధ నిబంధనల పరిధిలోకి వచ్చే వాటి పునరావృతిని నివారిస్తుంది.

తాజా మార్గదర్శకాల ప్రకారం- పరిశీలన, ఆమోదం సంబంధిత వివిధ దశలలో నిర్దిష్ట కాలపరిమితిని అనుసరించాలి. తద్వారా నిర్దిష్ట వ్యవధి ఆధారిత నిర్ణయ ప్రక్రియకు భరోసా ఉంటుంది. గనుల మూసివేత కోసం ఎస్క్రో ఖాతా నుంచి వాపసు చేసే వ్యవధిని క్లెయిమ్ తేదీ నుంచి ఒక నెలకు తగ్గించారు. దీంతోపాటు క్లెయిమ్‌ల ప్రయోగాత్మక తనిఖీకి కూడా వీలు కల్పించారు. అంతేకాకుండా ఎస్క్రో ఖాతా నుంచి నగదు ఉపసంహరణపై ఐదేళ్ల క్లెయిమ్‌ల ధ్రువీకరణ దిశగా ఏజెన్సీల పరిధిని కూడా విస్తరించారు.

నానాటికీ పురోగమిస్తున్న సాంకేతికతలకు అనుగుణంగా భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌ను ఒక మైనింగ్ పద్ధతిగా ఈ మార్గదర్శకాలు గుర్తిస్తాయి. “భూగర్భ గ్యాసిఫికేషన్-2026 దిశగా బొగ్గు-లిగ్నైట్ బ్లాక్‌లు/గనుల మైనింగ్ ప్రణాళిక తయారీ-ఆమోదంపై  మార్గదర్శకాలు” కూడా ఇందులో అంతర్భాగం అయ్యాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రాజెక్ట్ ప్రతిపాదకులకూ మరింత వెసులుబాటు కల్పించారు. గనులను వేగంగా కార్యాచరణలోకి తేవడంలో ఇది వెసులుబాటు కల్పిస్తుంది.

సరళ, ఆచరణాత్మక, వ్యవధి నిర్దేశిత ప్రక్రియల ద్వారా తాజా మార్గదర్శకాలు వాణిజ్య సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే, దేశ ఇంధన భద్రతకు మద్దతునిస్తూ గనుల కార్యాచరణను వేగిరపరుస్తాయని అంచనా. అంతేకాకుండా విస్పష్ట, కేంద్రీకృత నియంత్రణ చట్రం ద్వారా స్థానిక సమాజాల ప్రయోజనం కోసం శాస్త్రీయ పద్ధతిలో గనుల  మూసివేత సహా వాటి పునరుపయోగాన్ని ప్రోత్సహిస్తాయి.

****


(రిలీజ్ ఐడి: 2340747) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil