నాడు పోస్టు చేయడమైనది:
23 NOV 2026 6:48PM by PIB Hyderabad
కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఖనిజ రాయితీ (మూడో సవరణ) నిబంధనలు-2026ను సవరించింది. ఈ మేరకు నవంబరు 17 నాటి జి.ఎస్.ఆర్.999(ఇ) ద్వారా అధికార ప్రకటన జారీచేసింది. తదనుగుణంగా గుర్తింపు పొందిన అన్వేషణ సంస్థలు, మైనింగ్ ప్రణాళిక తయారీ సంస్థల గుర్తింపు వ్యవధిని 3 నుంచి 5 సంవత్సరాలకు పొడిగించింది.
ఈ సంస్కరణతో ఆవర్తన మదింపు, పునఃగుర్తింపు సంఖ్య తగ్గుతుంది. తద్వారా పునరావృత మదింపు, గుర్తింపు నిమిత్తం గుర్తింపు గల సంస్థల సమయం ఆదా అవుతుంది. గుర్తింపు దీర్ఘకాలిక చెల్లుబాటు, బొగ్గు-లిగ్నైట్ బ్లాక్‌లలో కార్యాచరణకు అవసరమైన భూగర్భ నివేదికలు, మైనింగ్ ప్రణాళికల తయారీ-కొనసాగింపు దిశగా భరోసా ఇస్తుంది.
బొగ్గు రంగంలో వాణిజ్య సౌలభ్యం, విశ్వాసాధారిత పాలన దిశగా ఈ సంస్కరణను కీలక మలుపుగా పరిగణించవచ్చు.
****