నాడు పోస్టు చేయడమైనది:
20 NOV 2026 4:18PM by PIB Hyderabad
నవంబర్ 21, 2026న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉదయం సుమారు 9:45 గంటలకు ఐఐటీ ఖరగ్‌పూర్ వజ్రోత్సవ వేడుకలకు హాజరవుతారు. ఈ సందర్బంగా అక్కడ ప్రసంగిస్తారు. అనంతరం బీహార్‌కు వెళ్తారు. వైశాలిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. తదనంతరం ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్‌కు చేరుకుంటారు. లక్నో గోమతి నగర్‌లోని ఇందిరాగాంధీ ప్రతిష్టాన్ వద్ద సాయంత్రం 5:30 గంటలకు 5వ కౌశల్ దీక్షాంత్ సమారోహ్ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగిస్తారు.
ఖరగ్‌పూర్‌లో పీఎం పర్యటన
ఐఐటీ ఖరగ్‌పూర్ వజ్రోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఐఐటీ ఖరగ్‌పూర్ 75 ఏళ్ల ప్రస్థానాన్ని తెలియజేసేలా 75 మంది విద్యార్థులతో ప్రధానమంత్రి సమావేశమవుతారు.
1951లో స్థాపించిన ఐఐటీ ఖరగ్‌పూర్… దేశంలోనే మొదటి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. జాతీయ ప్రాధాన్యత గల సంస్థగా గుర్తింపు పొందింది. భారతదేశంలో సాంకేతిక విద్య, పరిశోధన, ఆవిష్కరణల పురోగతిలో ఇది మార్గదర్శక పాత్ర పోషించింది.
లక్నోలో పీఎం పర్యటన
5వ కౌశల్ దీక్షాంత్ సమారోహ్‌లో ప్రధానమంత్రి పాల్గొంటారు. కౌశల్ దీక్షాంత్ సమారోహ్ 2021-22 విద్యా సంవత్సరంలో ప్రారంభమైంది. నైపుణ్యాభివృద్ధిలో ప్రతిభను గుర్తించేందుకు, నైపుణ్యం గల యువత శిక్షణ నుంచి ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెట్టటాన్ని వేడుకగా జరుపుకునే వార్షిక జాతీయ వేదికగా ఇది నిలిచింది. ఈ వేడుక ప్రారంభమైనప్పటి నుంచి నైపుణ్యాభివృద్ధి రంగంలోని ఆలిండియా టాపర్లను, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సత్కరిస్తూ... వృత్తి విద్యా, నైపుణ్య ఆధారిత కెరీర్ల పట్ల గర్వం, విజయం, ఉన్నతాశయాల సంస్కృతిని పెంపొందిస్తోంది.
ఈ ఏడాది పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐటీఐలు), జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థలు (ఎన్ఎస్‌టీఐలు), ఇనిస్టిట్యూట్స్ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ (ఐటీఓటీలు) నుంచి జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన 52 మంది టాపర్లను సత్కరిస్తారు.
***