బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వాణిజ్య ప్రధాన బొగ్గు గనుల వేలంపాటల్లో 16వ దఫాకు భారీ స్పందన.. 18 బొగ్గు బ్లాకులకు 85 బిడ్లు

వెనుకటి విడత కన్నా నాలుగింతల బిడ్లు.. ఆసక్తిని కనబరిచిన 20 మంది నూతన వేలందార్లు

ఇన్వెస్టర్ల మొగ్గు పెరగడంతో, భారత్ ఇంధన భద్రతలో బొగ్గుది కీలక భూమిక అని స్పష్టం

నాడు పోస్టు చేయడమైనది: 20 NOV 2026 4:23PM by PIB Hyderabad

వాణిజ్య ప్రధాన బొగ్గు గనుల 16వ దఫా వేలంతో పాటు 15వ దఫా వేలంపాట రెండో పర్యాయానికి సంబంధించిన వేలంపాటకు లభించిన బిడ్లను బొగ్గు మంత్రిత్వశాఖకు చెందిన నామినేటెడ్ అథారిటీ ఈ రోజు తెరచింది. ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 26 బ్లాకులకు వేలాన్ని నిర్వహించారు. 18 బొగ్గు బ్లాకులకు 85 బిడ్లు వచ్చాయి. ఈ ప్రతిస్పందన ఊహించిన దాని కన్న ఎక్కువగా ఉంది. ఇది ఇటీవలి విడతల్లో మిగతా రౌండ్లన్నిటితో పోలిస్తే అధిక స్థాయిలో వ్యక్తమైన ప్రతిస్పందనల్లో ఒకటి.  

ఆన్‌లైన్లో దాఖలైన బిడ్లను వేలందార్ల సమక్షంలో ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా తెరిచారు. ఆ తరువాత ప్రత్యక్షంగా అందిన బిడ్ దస్తావేజులున్న సీల్డ్ కవర్లను తెరిచారు. దీనిని దృశ్య మాధ్యమం ద్వారా ప్రదర్శించారు. ప్రతి విడతను పారదర్శకంగా నిర్వహించాలన్న ఆనవాయితీని మంత్రిత్వ శాఖ పాటిస్తోంది.

ఈ పరిణామం ఒక నిర్ణయాత్మక ఘటన అని చెప్పవచ్చు. 16వ విడతలో 17 బొగ్గు బ్లాకులకు 83 బిడ్లు వచ్చాయి. 15వ విడతకు సంబంధించి రెండో పర్యాయం ఒక బొగ్గు బ్లాకుకు 2 బిడ్లు అందాయి. వర్తమాన దఫాలో పోటీ బాగా పెరిగింది. 26 బ్లాకులలో 16 బ్లాకులకు అనేక బిడ్లు అందాయి. ఈ దఫాలో వాణిజ్య ప్రధాన బొగ్గు గని తవ్వకాల రంగంపై 20 మంది నూతన వేలందార్లు ఆసక్తిని కనబరిచారు. అంటే ఈ రంగం కొత్త పెట్టుబడిని, నూతన పాత్రధారులను నిరంతరం ఆకర్షిస్తోందని స్పష్టమవుతోంది.

ఆ భరోసా బలమైన పునాదులపైన ఆధారపడివుంది.  2025-26 ఆర్థిక సంవత్సరంలో కేప్టివ్ బ్లాకులు, వాణిజ్య తరహా బొగ్గు గనుల నుంచి బొగ్గును వెలికితీయడం 10.22 శాతం మేర వృద్ది చెంది, 210.46 మిలియన్ టన్నుల స్థాయికి చేరింది. ఆర్థిక వ్యవస్థలో బొగ్గుకు గిరాకీ అంతకంతకూ పెరుగుతున్న కొద్దీ భారతదేశానికి ఇంధన భద్రతను కల్పించడంలో బొగ్గు రంగానిది కీలక భూమిక అని తేలుతోంది.  2020 నాటి నుంచి, 15 విడతలలో 145 బొగ్గు గనులకు వేలం నిర్వహించారు. 44 కొత్త కంపెనీలు తెర మీదకు వచ్చాయి. ఈ గనులు ఏటా సుమారు రూ.47,500 కోట్ల రాబడిని ఇస్తాయని, దాదాపు 4.9 లక్షల ఉద్యోగావకాశాలను కల్పిస్తాయని భావిస్తున్నారు. వేలం ఫ్రేంవర్క్ దీనిని మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది.. దీనిలో, ఫలానా కార్యకలాపాలకే బొగ్గును వినియోగించాలన్న ఆంక్షలంటూ లేవు. ఆటోమేటిక్ రూట్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ)కి అవకాశం ఉంది. ముందస్తుగా చెల్లించవలసిన మొత్తమూ తక్కువగా ఉంది.

బహుళ విభాగాలు పాలుపంచుకొనే సాంకేతిక మూల్యాంకన సంఘం బిడ్లను పరిశీలించనుంది. సాంకేతికంగా అర్హతలు కలిగిన వేలందార్లను గుర్తించాక, ఎమ్ఎస్‌టీసీ వెబ్‌సైట్లో ఎలక్ట్రానిక్ పద్ధతిన నిర్వహించే తుది వేలం ప్రక్రియకు ఎంపిక చేస్తారు.

వాణిజ్య సరళి బొగ్గు గని తవ్వకం రంగం పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి దఫ దఫాకూ తీవ్రతరం అవుతున్నది. ప్రస్తుత విడతకు అసాధారణ ప్రతిస్పందన లభించడంతో ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వయంసమృద్ధి భారత్) లక్ష్య సాధనతో పాటు ‘2047 కల్లా వికసిత్ భారత్ దిశగా’ (అభివృద్ధి చెందిన భారతదేశాన్ని 2047 కల్లా నిర్మిద్దాం) మన దేశం పయనించడంలో గనుల తవ్వకం రంగం కీలక పాత్రను పోషించనుందని స్పష్టమవుతోంది.

***


(రిలీజ్ ఐడి: 2339194) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी