నాడు పోస్టు చేయడమైనది:
18 NOV 2026 6:10PM by PIB Hyderabad
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న మైగవ్, మై భారత్ సంస్థల సహకారంతో నిర్వహించే రాజ్యాంగ దినోత్సవ క్విజ్ - 2026లో పాల్గొనాలని పౌరులకు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆహ్వానం పలికింది. ఈ క్విజ్ 2026 నవంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. మొత్తం 500 మంది విజేతలను ఎంపిక చేయనున్నారు. వీరిలో మొదటి 100 మంది విజేతలకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున, తదుపరి 400 మంది విజేతలకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున నగదు బహుమతులు అందజేస్తారు. క్విజ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఈ - ధ్రువీకరణ పత్రం అందజేస్తారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి పునాది వంటి భారత రాజ్యాంగం న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది. పౌరుల హక్కులకు రక్షణ కల్పించడంతో పాటు, వారి ప్రాథమిక విధులను నిర్దేశిస్తుంది. దేశ ప్రజలందరినీ ఏకతాటిపై నిలిపే ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేస్తుంది.
రాజ్యాంగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించే నిరంతర ప్రయత్నాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ క్విజ్… భారత రాజ్యాంగ నిర్మాణం, పౌరుల ఓటు హక్కులు, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా నిలిచిన విలువలపై తమ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవడంతో పాటు మరింత తెలుసుకునేందుకు పౌరులను ప్రోత్సహిస్తుంది. భారత రాజ్యాంగ వారసత్వాన్ని వేడుకగా జరుపుకోవడానికి, పౌరుల హక్కులను అర్థం చేసుకోవడానికి, వికసిత్ భారత్ నిర్మాణంలో తమ విధులను మరోసారి గుర్తుచేసుకుని వాటి పట్ల నిబద్ధతను చాటుకోవడానికి ఈ క్విజ్ అవకాశం కల్పిస్తుంది.
పౌరులు https://www.quiz.mygov.in, https://mybharat.gov.in/quizzes/yuva/ వెబ్‌సైట్ల ద్వారా ఈ క్విజ్‌లో పాల్గొనవచ్చు. ఈ క్విజ్ ఇంగ్లిష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
***