నాడు పోస్టు చేయడమైనది:
17 NOV 2026 4:13PM by PIB Hyderabad
మనీలాలో జరిగిన 21వ తూర్పు ఆసియా సదస్సు (ఈఏఎస్)లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు.
సంక్షోభం, సంఘర్షణలతో నిండిన ప్రస్తుత సమయంలో శాంతి కోసం చేసే అన్ని ప్రయత్నాలకు మద్దతుగా చర్చలు, పరస్పర గౌరవం, సహకారం అవసరమని ప్రధాని స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుతమైన, సమ్మిళితమైన, నియమ నిబంధనలతో కూడిన ఇండో-పసిఫిక్ ప్రాంతానికి పిలుపునిచ్చారు. ప్రపంచ వేదికపై శాంతి, స్థిరత్వం, నిలకడైన పరిస్థితులను తీసుకురావడంలో ఈఏఎస్ దోహదపడాలని ప్రధాని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధనం, ఎరువుల భద్రతపై సంక్షోభాలు, సంఘర్షణలు చూపిస్తున్న ప్రభావం గురించి ఆయన ప్రస్తావించారు. అంతర్జాతీయ జలమార్గాల్లో దాడులకు గురవుతున్న వాణిజ్య నౌకలు, నావికుల భద్రతకు హామీ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలకు శాంతియుత పరిష్కారాన్ని అన్వేషించేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి తెలియజేశారు.
శాంతియుత సమాజాలకు ఉగ్రవాదం వల్ల ఎదురయ్యే ముప్పుల గురించి ఆయన వివరించారు.
ఈఏఎస్ వేదిక అంతటా సహకారాన్ని బలోపేతం చేసేందుకు దిగువ పేర్కొన్న వాటిని ప్రధాని ప్రతిపాదించారు:
-
ఉమ్మడి శిక్షణ, అత్యవసర స్పందనలో సహకారం కోసం నావికుల భద్రతా కార్యక్రమం.
-
ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు లాంటి సీమాంతర నేరాల వల్ల ఎదురవుతున్న ఆధునిక ముప్పులను పరిష్కరించేందుకు నేషనల్ జాతీయ సైన్స్ విశ్వవిద్యాలయంలో ఈఏఎస్ సైబర్ క్రైమ్ కాన్ఫరెన్స్
-
లోథాల్లో ఈఏఎస్ మ్యారీటైమ్ హెరిటేజ్ ఫెస్టివల్
-
ఈఏఎస్ దేశాలతో విస్తృత విద్యా సహకారాన్ని ప్రోత్సహించేలా నలందలో ఈఏఎస్ యూనివర్సిటీ కాంక్లేవ్
ఈ శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన ఫిలిప్పీన్స్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ను ప్రధానమంత్రి అభినందించారు.
ప్రధాని పూర్తి ప్రసంగాన్ని ఇక్కడ చూడొచ్చు [link].
***