ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మనీలాలో ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా థాయిలాండ్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 17 NOV 2026 4:02PM by PIB Hyderabad

మనీలాలో 23వ భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు, 21వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా  నవంబర్ 17, 2026న థాయిలాండ్ ప్రధానమంత్రి గౌరవ శ్రీ అనుతిన్ చర్న్ విరాకుల్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

ఏప్రిల్‌ 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ థాయిలాండ్ పర్యటన సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఎదిగిన ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించేందుకు ఈ సమావేశం చక్కని అవకాశాన్ని కల్పించింది. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, అనుసంధానత, డిజిటల్ సాంకేతికతలు, ఫిన్‌టెక్, సంస్కృతి, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించుకునే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. బిమ్‌స్టెక్, ఐఓఆర్‌ఏ, మెకాంగ్ గంగా సహకారం, ఆసియాన్ నేతృత్వంలోని ప్రాంతీయ వేదికల్లో పరస్పరం కలిసి పనిచేయాల్సిన ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. వివిధ ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నిబద్ధతను తెలియజేశారు.

భారత్, థాయిలాండ్‌ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా స్నేహం కొనసాగుతోంది. ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక వారసత్వం, ప్రజల మధ్య సంబంధాలు, పరస్పర విశ్వాసాలపై ఈ స్నేహం ఆధారపడి ఉంది. భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఆసియాన్‌తో ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో థాయిలాండ్ కీలక భాగస్వామిగా కొనసాగుతోంది.

***


(రిలీజ్ ఐడి: 2337709) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam