ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిపట్ల సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 17 NOV 2026 10:57AM by PIB Hyderabad

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్‌ జిల్లాలో జరిగిన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్‌ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగటం దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: పీఎం @narendramodi


(రిలీజ్ ఐడి: 2337509) సందర్శకుల సూచీ సంఖ్య : : 8