నాడు పోస్టు చేయడమైనది:
17 NOV 2026 10:55AM by PIB Hyderabad
జ్ఞానాన్వేషణలో విశ్వాసానికి, అంకితభావానికి, స్వీయ క్రమశిక్షణకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
‘‘శ్రద్ధావాన్‌లభతే జ్ఞానం తత్రః సంయతేన్ద్రియః
జ్ఞానం లబ్ధవా పరాం శాన్తిమచిరేణాధిగచ్ఛతి’’ అని ప్రధాని పేర్కొన్నారు.
పైన ప్రస్తావించిన శ్లోకానికి.. విశ్వాసం కలిగివుండే వారు, జ్ఞానాన్వేషణ క్రమంలో స్థిరబుద్ధితో నడుచుకొనే వారు, ఇంద్రియాలపై నియంత్రణ సాధించేవారు అసలైన వివేకాన్ని పొందుతారు. వివేకం ఆర్జించినప్పుడు పరమ శాంతి దిశగా పయనించవచ్చును. విశ్వాసం, నిబద్ధత, స్వీయ క్రమశిక్షణ సహితంగా జ్ఞానం కోసం అన్వేషిస్తూ పోతే, అది అంతరంగంలో శాంతి, ఆధ్యాత్మిక పరిపూర్ణత వైపునకు తీసుకువెళ్తుంది.. అని అర్థం.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘శ్రద్ధావాన్‌లభతే జ్ఞానం తత్రః సంయతేన్ద్రియః
జ్ఞానం లబ్ధవా పరాం శాన్తిమచిరేణాధిగచ్ఛతి’’ అని పేర్కొన్నారు.