నాడు పోస్టు చేయడమైనది:
16 NOV 2026 3:55PM by PIB Hyderabad
ఇస్రో పూర్వ చైర్మన్ శ్రీ సోమనాథ్ శ్రీధర పణిక్కర్ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
అంతరిక్ష రంగంలో భారత్ ఆకాంక్షలను సాకారం చేయడంలో ప్రధానమంత్రి సారథ్యం, సుస్పష్ట జాతీయ దృష్టికోణం ఎలా తోడ్పడ్డాయో ఈ వ్యాసం వివరిస్తుంది. అంతరిక్ష రంగంలో పనిచేసేందుకు ప్రయివేటు సంస్థలకు కూడా అవకాశాన్ని కల్పించడంలో 2023వ సంవత్సరంలో రూపొందించిన భారత్ అంతరిక్ష విధానం పోషించిన కీలక పాత్రను, మానవుల అంతరిక్ష యాత్ర, అంతరిక్షంలో భారతీయ కేంద్రం స్థాపన, చంద్ర గ్రహ రహస్యాలను కనిపెట్టడం సహా భారత్ భావి సాహసయాత్రలు ఏ విధంగా ఉండేదీ వ్యాసంలో ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘‘చంద్రుని దిశగా పెద్ద ముందంజ. అంతేకాదు, అంతరిక్షంలో భారతదేశ భవితను గొప్పగా ఆవిష్కరించిన కథనం.
అంతరిక్ష రంగంలో భారత్ ఆకాంక్షలను సాకారం చేయడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యం, సుస్పష్ట జాతీయ దృష్టికోణం ఏ మేరకు దోహదం చేశాయో ఇస్రో మాజీ చైర్మన్ శ్రీ సోమనాథ్ శ్రీధర పణిక్కర్ చెప్పారు.
అంతరిక్ష రంగంలో పనిచేసేందుకు ప్రయివేటు సంస్థలకు కూడా అవకాశాన్ని కల్పించడంలో 2023వ సంవత్సరంలో రూపొందించిన భారత్ అంతరిక్ష విధానం పోషించిన కీలక పాత్రను, మానవుల అంతరిక్ష యాత్ర, అంతరిక్షంలో భారతీయ కేంద్రం స్థాపన, చంద్ర గ్రహ మర్మాలను కనిపెట్టడం సహా భవిష్యత్తులో భారత్ సాహసయాత్రలు ఏ విధంగా ఉండేదీ శ్రీ పణిక్కర్ తన వ్యాసంలో ప్రస్తావించారు.
ఆ వ్యాసాన్ని తప్పక చదవగలరు.
timesofindia.indiatimes.com/science/from-c…” అని పేర్కొంది.
***