సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నవంబరు 20 నుంచి 28 వరకు గోవాలో భారత 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం-2026 (ఐఎఫ్‌ఎఫ్‌ఐ)


‘సరిహద్దుల అతీత కథా వేదిక’ ఇతివృత్తంగా ప్రపంచ సినిమాలు.. సృజనాత్మక సామర్థ్యాల ప్రదర్శన

ఉత్సవాల ప్రారంభోత్సవంపై 13న పాత్రికేయ సమావేశంలో గోవా ముఖ్యమంత్రి డాక్టర్‌ శ్రీ ప్రమోద్ సావంత్ సమక్షాన ముఖ్యాంశాల వివరణ

గోవాలో ఈ నెల 20 నుంచి 28 వరకూ ‘సరిహద్దుల అతీత కథా వేదిక’ ఇతివృత్తంగా భారత 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం-2026 (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) సినీ అభిమానులను అలరించనుంది. ప్రపంచవ్యాప్త చిత్రదర్శకులు, నిర్మాతలు, సినీ ప్రియుల హాజరు సహా సృజనాత్మక సామర్థ్య ప్రదర్శనకు ఈ ఉత్సవం వేదికగా నిలుస్తుంది.

ఈ ఉత్సవాల ప్రారంభోత్సవంపై నవంబరు 13న ‘తాజ్ సిడాడే డి గోవా హొరైజన్‌’లో పాత్రికేయ సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉత్సవాల సంబంధిత ముఖ్యాంశాలు, ప్రధాన ఆకర్షణలు, కీలక కార్యక్రమాలను వివరిస్తారు.

గౌరవనీయులైన గోవా ముఖ్యమంత్రి డాక్టర్‌ శ్రీ ప్రమోద్ సావంత్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఈఎస్‌జీ) వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి డెలిలా లోబోతో పాటు కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్, నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డీసీ) చైర్‌పర్సన్ శ్రీ జి.కృష్ణకుమార్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ధీరజ్ సింగ్, ఐఎఫ్‌ఎఫ్‌ఐ-2026 ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీ అశుతోష్ గోవారికర్, ఫెస్టివల్ జ్యూరీ చైర్‌పర్సన్‌ కూడా దీనికి హాజరవుతారు.

అంతర్జాతీయంగా ఐఎఫ్‌ఎఫ్‌ఐ ప్రాచుర్యం ఏటికేడు ఇనుమడిస్తోంది. ఈ వైశిఫ్ట్యాన్ని ప్రతిబింబిస్తూ 57వ చలనచిత్రోత్సవంలో భారత-అంతర్జాతీయ సినిమా వైభవాన్ని చాటే విస్తృత, విభిన్న కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. ఈ వేడుకలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాల వివరాలను పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడిస్తారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు, ఉత్సవ భాగస్వాముల కోసం గుదిగుచ్చిన సినిమా అనుభవాలు, సృజనాత్మక ఆదానప్రదానంపై సంగ్రహ సమాచారం లభిస్తుంది.

భౌగోళిక-సాంస్కృతిక సరిహద్దులకు అతీతమైన విభిన్న కథలు, మానవాళి సమష్టి అనుభవాల కథనాలతో ప్రేక్షకులను అనుసంధానించే మాధ్యమంగా చలనచిత్ర రంగాన్ని ఆవిష్కరించాలన్నది “సరిహద్దుల అతీత కథా వేదిక” ఇతివృత్తంగా నిర్వహిస్తున్న ఈ చలనచిత్రోత్సవ ధ్యేయం.

***


(రిలీజ్ ఐడి: 2335674) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , हिन्दी , Gujarati , Tamil , Kannada , Marathi