ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తములు ఇతరుల సంక్షేమాన్ని కోరుకుంటూ నిస్వార్థంగా అంకితభావాన్ని చాటుకుంటారని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 12 NOV 2026 8:13AM by PIB Hyderabad

ఉత్తములు పరుల సంక్షేమానికి తమను తాము ఎల్ల వేళలా అంకితం చేసుకొంటారని, ఎలాంటి అపేక్షను పెట్టుకోకుండా నిస్వార్థంగా పాటుపడతారని, సహజ ప్రకాశాన్ని వ్యాపింపచేసే దివ్య రత్నాలతో వీరిని పోల్చవచ్చని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘అపేక్షన్తే న చ స్నేహం న పాత్రం న దశాన్తరమ్
సదా లోకహితే యుక్తా రత్నదీపా ఇవోత్తమాః’’ అని పేర్కొన్నారు.
ఈ శ్లోకానికి అర్థం ఇదీ.. ‘సదాచార పరాయణులు ఎల్లప్పుడూ ఇతరుల సంక్షేమానికి తమను తాము అంకితం చేసుకొంటారు. స్వార్థానికి చోటీయకుండా పనులను పూర్తి చేస్తూ ఉంటారు. తమ నిస్వార్థ ప్రయత్నాలకు బదులుగా ఆప్యాయతను ఆశించడమో, లేదా సహాయాన్ని అందుకున్న వ్యక్తి అందుకు పాత్రులేనా, కాదా అని తరచి చూడటమో, లేదా అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాన్ని పట్టించుకోవడమో చేయరు. వీరు.. స్వయంప్రకాశాన్ని  చిమ్మే దివ్య రత్నాల వంటి వారు.’

 

***


(రిలీజ్ ఐడి: 2335411) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Punjabi , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam