బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రూ.37,500 కోట్ల విలువైన ఉపరితల బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకంలో 2వ రౌండు ముగింపు


రెండు దరఖాస్తులు దాఖలు చేసిన ఎన్‌టీపీసీ.. నేటి నుంచి మొదలైన మూడో రౌండు

నాడు పోస్టు చేయడమైనది: 10 NOV 2026 4:29PM by PIB Hyderabad

రూ.37,500 కోట్ల వ్యయంతో ఉపరితల బొగ్గు/నేలబొగ్గు (లిగ్నైట్) గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకాన్ని చేపట్టడానికి కేంద్ర మంత్రిమండలి 2026 మే 13న ఆమోదం తెలిపింది. దేశంలో ఉపరితల బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను వేగవంతం చేయడం ఈ స్కీము లక్ష్యం.

రెండో రౌండు ముగిసినట్లు బొగ్గు మంత్రిత్వశాఖ ఈ రోజు ప్రకటించింది. దీంతో పథకం లక్ష్యాలను ముందుకు తీసుకుపోవడంలో ముందడుగు వేసినట్లయింది. 2వ రౌండులో ఎన్‌టీపీసీ సంస్థ రెండు దరఖాస్తులు దాఖలు చేసింది. ఈ దరఖాస్తులు యూరియా, మెథనాల్, డైమిథైల్ ఈథర్ (డీఎమ్ఈ) ఉత్పాదనకు సంబంధించినవి. కీలక పారిశ్రామిక ఉత్పాదనలను దేశీయంగా ఉత్పత్తి చేయడానికీ, అలాగే భారతదేశంలో స్థానిక వనరుల వినియోగాన్ని వివిధ ప్రయోజనాలకు వాడుకోవడానికీ కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియ శక్తియుక్తుల్ని ఉపయోగించుకోవచ్చని ఈ దరఖాస్తుల్లో ప్రస్తావించారు.

రెండో రౌండులో అందిన దరఖాస్తుల వివరాలు:

వరుస సంఖ్య

దరఖాస్తుదారు

ఉత్పాదన(లు)

1.

ఎన్‌టీపీసీ 

యూరియా

2.

ఎన్‌టీపీసీ

మెథనాల్, డైమిథైల్ ఈథర్ (డీఎమ్ఈ)

మొదటి రెండు రౌండ్ల ప్రగతిని బొగ్గు మంత్రిత్వశాఖ పరిగణనలోకి తీసుకొని, పథకంలో మూడో రౌండును 2026 నవంబర్ 10 నాటి నుంచి ప్రారంభించింది. దీని ద్వారా, అర్హతలు గల సంస్థలు దేశంలో బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను సమర్పించడానికి మరో అవకాశాన్ని కల్పిస్తున్నారు. 3వ రౌండులో దరఖాస్తులను దాఖలు చేయడానికి 2027 జనవరి 11ఆఖరు గడువు తేదీ అని పేర్కొన్నారు. వరసగా  రౌండ్లను నిర్వహిస్తూ,  పారిశ్రామిక రంగంలో మరిన్ని సంస్థలను దీనిలో పాలుపంచుకొనేటట్లు ప్రోత్సహించి పెట్టుబడులను ఆకర్షించి బొగ్గును సింథటిక్ గ్యాసుగా మార్చే (కోల్ గ్యాసిఫికేషన్) సాంకేతికతల అనుసరణను వేగవంతం చేసి, 2030 కల్లా 100 మిలియన్ టన్నుల కోల్ గ్యాసిఫికేషన్ లక్ష్య సాధనకు తోడ్పడాలని బొగ్గు శాఖ ధ్యేయంగా పెట్టుకుంది. సింథెటిక్ గ్యాసు (దీనిని ‘సిన్‌గ్యాస్’ అని కూడా పిలుస్తారు. దీనిని అనేక రకాలైన ఎరువులు, ఇంధనాలు, ద్రావకాలతో పాటు రసాయనిక ఉత్పాదనలు, పదార్థాలను తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.)

 

***


(రిలీజ్ ఐడి: 2334726) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , English , Urdu , Marathi