ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భోపాల్‌లో 6.642 కేజీల యాంఫెటమిన్‌ను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ: డ్రగ్ ట్రాఫికర్ అరెస్టు

నాడు పోస్టు చేయడమైనది: 10 NOV 2026 3:12PM by PIB Hyderabad

నిర్దిష్ట సమాచారం ఆధారంగా, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు 2026 నవంబర్ 5న ఢిల్లీ నుంచి భోపాల్‌కు బస్సులో ప్రయాణిస్తున్న మాదకద్రవ్యాల స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికుడిని అధికారులు తనిఖీ చేశారు. బ్యాగ్‌లో మూడు వెండి రంగు ప్లాస్టిక్ ప్యాకెట్లలో దాచి ఉంచిన 6.642 కిలోల బరువున్న తెల్లటి స్పటిక పదార్థాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

 

ఎన్డీపీఎస్ ఫీల్డ్ టెస్ట్ కిట్‌ను ఉపయోగించి పరీక్షించినప్పుడు స్వాధీనం చేసుకున్న పదార్థం యాంఫెటమిన్‌గా నిర్ధారణ అయింది. ఇది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌ స్టెన్స్ (ఎన్డీపీఎస్) చట్టం-1985 నియంత్రణ పరిధిలోకి వచ్చే సైకోట్రాపిక్ పదార్థం. ఎన్‌డీపీఎస్ చట్టం-1985 లోని సంబంధిత నిబంధనల మేరకు అధికారులు ఆ యాంఫెటమిన్‌ను జప్తు చేశారు. అలాగే ఈ చట్టం ప్రకారం నిందితుడైన ప్రయాణికుడిని అరెస్టు చేశారు. 

నిందితుడు గతంలో బెంగళూరు పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం నమోదు చేసిన కేసులో బెయిలుపై ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఇది నిందితుడు తరచూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు స్పష్టం చేస్తోంది.

నిఘా ఆధారిత చర్యలు, మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారంలో ప్రమేయం ఉన్నవారిపై నిరంతర కార్యాచరణ ద్వారా మాదక ద్రవ్యాల రవాణా వ్యవస్థలను పూర్తిగా నిర్మూలించేందుకు డీఆర్‌ఐ కట్టుబడి ఉంది. 

 

***


(రిలీజ్ ఐడి: 2334701) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Assamese