ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 10 NOV 2026 9:16AM by PIB Hyderabad

నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త ప్రారంభం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆనందం, శాంతి, శ్రేయస్సు, సమృద్ధికి కొత్త ఆశలను తీసుకువస్తుందని ఆకాంక్షించారు.

 

ప్రతి ఒక్కరి జీవితంలోనూ మంచి ఆరోగ్యం, ఉత్సాహం, ఉల్లాసంతో నిండాలని ప్రధాని ఆకాంక్షించారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి చేసిన పోస్టు:

"నూతన సంవత్సర శుభాకాంక్షలు…!!!

ఈ కొత్త సంవత్సర పవిత్ర ప్రారంభం మీ అందరి జీవితాల్లోనూ ఆనందం, శాంతి, శ్రేయస్సు, సమృద్ధికి కొత్త ఆశలను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. అందరి జీవితాల్లోనూ మంచి ఆరోగ్యం, ఉల్లాసం, ఉత్సాహం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను!"

 

***


(రిలీజ్ ఐడి: 2334552) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Gujarati , Tamil