గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కీలక ఖనిజ బ్లాకుల తొమ్మిదో విడత వేలం... అన్వేషణ లైసెన్సు మూడో విడత వేలం ప్రారంభించిన గనుల మంత్రిత్వశాఖ


కీలక సంస్కరణలనూ ప్రవేశపెట్టిన మంత్రిత్వశాఖ

నాడు పోస్టు చేయడమైనది: 05 NOV 2026 4:45PM by PIB Hyderabad

కీలకమైన, వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల ఇ-వేలానికి సంబంధించిన తొమ్మిదో విడత వేలం ప్రక్రియను, అన్వేషణ లైసెన్స్ బ్లాకుల కేటాయింపు కోసం మూడో విడత వేలాన్నీ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రోజు అధికారికంగా ప్రారంభించారు. గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రముఖులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

కీలక, వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల తొమ్మిదో విడత వేలం ప్రారంభం:

ఖనిజ (వేలం) నిబంధనల ప్రకారం మొత్తం 20 కీలక, వ్యూహాత్మక ఖనిజ బ్లాకులను ఈ తొమ్మిదో విడతలో వేలానికి ఉంచారు. అంతకుముందు జరిగిన ఎనిమిది విడతల్లో... మొత్తం 100 విభిన్నమైన కీలక, వ్యూహాత్మక ఖనిజ బ్లాకులను వేలం వేయగా, అందులో 64 బ్లాకులు విజయవంతంగా అమ్ముడయ్యాయి ఈ వేలం ప్రక్రియలో ఇప్పటివరకు 64 శాతం విజయాల రేటు నమోదైంది.

వేలం కోసం ఉంచిన బ్లాకుల వివరాలు:

రాష్ట్రం

బ్లాకుల సంఖ్య

ఖనిజాలు

ఆంధ్రప్రదేశ్

1

గ్రాఫైట్

బీహార్

1

గ్లాకోనైట్

ఛత్తీస్‌ఘడ్

5

ఫాస్ఫోరైట్-సున్నపురాయి, వెనేడియం, గాలియం, టైటానియం, రేర్ ఎర్త్ మూలకాలు (ఆర్ఈఈ), బాక్సైట్, అల్యూమినస్ లాటరైట్, గ్లాకోనైట్

మధ్య ప్రదేశ్

2

వెనేడియం, గాలియం, టైటానియం, బాక్సైట్, అల్యూమినస్ లాటరైట్

మహారాష్ట్ర

2

రేర్ ఎర్త్ మూలకాలు (ఆర్ఈఈ), అరుదైన లోహాలు, వెనేడియం, గాలియం, టైటానియం, బాక్సైట్, అల్యూమినస్ లాటరైట్

రాజస్తాన్

3

పొటాష్, హాలైట్, టంగ్‌స్టన్

తెలంగాణ

3

టైటానియం, వెనేడియం, స్కాండియం, గాలియం, అల్యూమినస్ లాటరైట్

పశ్చిమ బెంగాల్

3

గ్రాఫైట్, రేర్ ఎర్త్ మూలకాలు (ఆర్ఈఈ), అరుదైన లోహాలు

అమ్మకానికి ఉంచిన బ్లాకుల్లో వివిధ రకాల వ్యూహాత్మకంగా కీలకమైన ఖనిజాల పోర్ట్‌ఫోలియో ఉంది. పరిశుద్ధ ఇంధన సాంకేతికతలు, ఎలక్ట్రిక్ మొబిలిటీ, అధునాతన తయారీ, ఎరువులు, రక్షణ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఇవి కీలకమైనవి. తద్వారా ఇవి భారత ఖనిజ భద్రతను బలోపేతం చేయడంతో పాటు దేశ ఇంధన పరివర్తనకూ మద్దతునిస్తాయి.

అన్వేషణ లైసెన్స్ (ఈఎల్) వేలం మూడో విడత ప్రారంభం

ఖనిజ బ్లాకు వేలం తొమ్మిదో విడతతో పాటు, అన్వేషణ లైసెన్స్ (ఈఎల్) మంజూరు కోసం మూడో విడత వేలాన్నీ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఎంఎండీఆర్ చట్టంలోని సెక్షన్ 10బీఏ ద్వారా ప్రవేశపెట్టిన అన్వేషణ లైసెన్సులు... చట్టంలోని ఏడో షెడ్యూల్‌లో పేర్కొన్న 29 కీలకమైన, భూమి లోతైన పొరల్లో గల ఖనిజాల అన్వేషణలో ప్రైవేట్ పెట్టుబడులను అనుమతిస్తాయి. తద్వారా మైనింగ్ ప్రారంభం కాకముందే ప్రైవేట్ పరిశ్రమకు అన్వేషణ అవకాశాలను అందుబాటులో ఉంచుతాయి. ఇప్పటికే, రెండు విడతల్లో 11 ఈఎల్ బ్లాకుల వేలం విజయవంతంగా పూర్తయింది.

మూడో విడత వేలానికి ఉంచిన అన్వేషణ లైసెన్స్ బ్లాకుల వివరాలు:

రాష్ట్రం

బ్లాకుల సంఖ్య

ఖనిజాలు

మధ్య ప్రదేశ్

1

రాగి

మహారాష్ట్ర

1

వెనేడియం

పశ్చిమ బెంగాల్

1

రేర్ ఎర్త్ మూలకాలు (ఆర్ఈఈ)

రాజస్తాన్

4

పొటాష్, హాలైట్, రేర్ ఎర్త్ మూలకాలు (ఆర్ఈఈ), అనుబంధ మినరలైజేషన్

తెలంగాణ

3

రేర్ ఎర్త్ మూలకాలు (ఆర్ఈఈ)

గుజరాత్

1

వెనేడియం, అనుబంధ మినరలైజేషన్

 

వేలం ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వ సంస్కరణలు:

మైనింగ్ రంగంలో పెట్టుబడిదారుల నమ్మకాన్ని, సులభతర వాణిజ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ప్రభుత్వం అనేక కీలక సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా, 16 అక్టోబర్ 2026న 'ఖనిజ (వేలం) మూడో సవరణ నిబంధనలు-2026' ను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ నూతన నిబంధనల ప్రకారం, 'పార్ట్-డి' ఖనిజాల కోసం జరిగే రెండో విడత వేలానికి అవసరమైన సాంకేతిక అర్హత పొందిన బిడ్డర్ల కనీస సంఖ్యను మూడు నుంచి రెండుకు తగ్గించారు. గతంలో ఖనిజ బ్లాకులు అమ్ముడవకపోవడానికి గల ప్రధాన సమస్యను పరిష్కరిస్తూ... ప్రస్తుత రెండు విడతల టెండర్ పత్రాల్లోనే ఈ మార్పును చేర్చారు. ఇకపై గనుల కేటాయింపునకు సంబంధించిన అంగీకార పత్రాలను 'యూనిఫైడ్ మైనింగ్ పోర్టల్' ద్వారా స్వయంచాలకంగా జారీ చేయనున్నారు. 'ఖనిజ (వేలం) రెండో సవరణ నిబంధనలు-2025', 'ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్స్' వంటి మునుపటి సంస్కరణల విజయాల ఆధారంగా ఈ సరికొత్త మార్పులను ప్రవేశపెట్టారు.

ఈ రెండు వేలం ప్రక్రియలకు సంబంధించిన టెండర్ పత్రాల విక్రయం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ టెండర్ పత్రాలను కొనుగోలు చేయడానికి 2027 జనవరి 1వ తేదీ (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 17:00 గంటల వరకు) గడువునిచ్చారు. టెక్నికల్ బిడ్, ప్రాథమిక ధర ఆఫర్‌లతో కూడిన బిడ్లను సమర్పించడానికి 2027 జనవరి 7వ తేదీ (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 17:00 గంటల వరకు) గడువునిచ్చారు.

ఈ ప్రక్రియలో కాంపోజిట్ లైసెన్స్, మైనింగ్ లీజుకు సంబంధించిన కీలక ఖనిజ బ్లాకులను పారదర్శకమైన రెండు దశల ఆన్‌లైన్ 'అసెండింగ్ ఫార్వర్డ్ వేలం' విధానంలో కేటాయిస్తారు. ఇందులో ప్రభుత్వానికి అత్యధిక ఆదాయ వాటాను ఆఫర్ చేసిన బిడ్డర్ విజేతగా నిలుస్తారు. మరోవైపు, అన్వేషణ లైసెన్స్ బ్లాకులను పారదర్శకమైన రెండు దశల ఆన్‌లైన్ 'డిసెండింగ్ రివర్స్ వేలం' విధానంలో కేటాయిస్తారు. ఇందులో భవిష్యత్తులో గనులు తవ్వే లీజుదారుల ఆదాయ వాటా నుంచి అత్యంత తక్కువ శాతం వాటాను కోరిన బిడ్డర్ విజేతగా నిలుస్తారు. ఈ వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు, టెండర్ పత్రాలు 'ఎంఎస్‌టీసీ ఇ-వేలం' అధికారిక ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంచారు.

https://www.mstcecommerce.com/auctionhome/mlcln/

ఈ సరికొత్త వేలం ప్రక్రియలు, చరిత్రాత్మక సంస్కరణల ద్వారా... దేశంలో కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాల దేశీయ లభ్యతను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తోంది. ఈ చర్యల ద్వారా ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు... ఖనిజాల అన్వేషణను, బాధ్యతాయుతమైన మైనింగ్‌ను విస్తృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా దేశంలో అత్యంత సమర్థమైన, స్వయంసమృద్ధి గల, ప్రపంచంతో పోటీ పడగల ఒక పటిష్ఠ ఖనిజ వ్యవస్థను నిర్మించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

***


(రిలీజ్ ఐడి: 2333433) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Tamil