బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక కార్యక్రమం-6 కింద సైట్ శుభ్రత 130 శాతం.. వ్యర్థాల తొలగింపు 162 శాతం లక్ష్యాలను సాధించిన బొగ్గు మంత్రిత్వశాఖ


ప్రజల సమస్యలు.. పీఎంఓ రిఫరెన్స్‌ల 100 శాతం పరిష్కారం సహా వ్యర్థాల తొలగింపు ద్వారా ₹61.41 కోట్లు ఆర్జన

సుస్థిర వనరుల నిర్వహణ దిశగా వ్యర్థం నుంచి అర్థం సృష్టి దిశగా వినూత్న కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలు

నాడు పోస్టు చేయడమైనది: 04 NOV 2026 5:20PM by PIB Hyderabad

   కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం-6లో భాగంగా బొగ్గు మంత్రిత్వశాఖ, దాని పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థలు అన్ని కీలక పారామితుల రీత్యా అసాధారణ  సామర్థ్యంతో సంస్థాగత ప్రక్షాళన-పాలన సంస్కరణలలో ఆదర్శప్రాయ ప్రమాణాలను నెలకొల్పాయి.

ఈ మేరకు బొగ్గు మంత్రిత్వ శాఖ తన పరిధిలోని 1,565 బొగ్గు క్షేత్రాల ప్రక్షాళన లక్ష్యాన్ని మించి 2,035 సైట్లను (130 శాతం) శుభ్రం చేసింది. తదనుగుణంగా ప్రణాళిక ప్రకారం 10.18 మిలియన్ చదరపు అడుగులకుగాను అంతకు మించి 14.84 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణాన్ని (146శాతం) శుభ్రపరచింది. భౌతికంగా సాధించిన  ఈ విజయాలతో పాటు 253 ప్రజా ఫిర్యాదులను, మరోవైపు 52 పీఎంఓ రిఫరెన్స్‌లను కూడా పూర్తిగా (100 శాతం) పరిష్కరించింది.

అదేవిధంగా వ్యర్థాల విషయంలో 10,909 టన్నుల లక్ష్యానికి గాను 17,686 టన్నుల మేర (162 శాతం) తొలగించడం ద్వారా ₹61.41 కోట్ల ఆదాయం కూడా ఆర్జించింది. అలాగే 59,593 ఫైళ్ల ప్రక్షాళన లక్ష్యంలో 1,79,793 భౌతిక, ఇ-ఫైళ్ల సమీక్ష ద్వారా క్రమబద్ధీకరణ రీత్యా అద్భుత ప్రగతి సాధించింది. మరో 1,70,336 ఫైళ్ల తొలగింపు- మూసివేతను పూర్తిచేసింది. ఈ విజయాలను 16,424 ట్వీట్లు, 38 పీఐబీ ప్రకటనలతో సోషల్ మీడియా ప్రచారం ద్వారా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లింది.

ఈ కార్యక్రమంలో భాగంగా అనుసరించిన కీలక ఉత్తమ పద్ధతులిలా ఉన్నాయి:

  1. ఎన్ఎల్‌సి ఇండియా లిమిటెడ్, నైవేలిలోని గని-I వద్ద ‘వ్యర్థం నుంచి అర్థం’ కింద తుక్కుతో బాలల పర్యావరణ పార్కును రూపొందించింది. దీన్ని ఈ ఏడాది అక్టోబరు 22న ప్రారంభించారు. మొత్తం 2.5 టన్నుల ఇనుప తుక్కు, 3,000 సాలిడ్ బ్లాక్‌లు, థానే తుఫాను వల్ల కూలిన చెట్ల నుంచి సేకరించిన కలపసహా రక్షిత కలప పునర్వినియోగంతో రూపొందిన ఈ పార్కు వనరుల సుస్థిర వినియోగానికి ఉదాహరణగా నిలుస్తోంది.

 

 

  1. ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ సంస్థ శాంటోరియాలోని తన ప్రధాన కార్యాలయంలో  పనికిరాని వస్తువులు, పారవేసే సామగ్రి నిల్వకు ఉపయోగించిన ఒక పెద్ద గదిని సుందర, సంపూర్ణ సదుపాయ సహిత శిశు సంరక్షణ కేంద్రంగా తీర్చిదిద్దింది. త స్థల సద్వినియోగంతోపాటు ఉద్యోగుల సంక్షేమం, పని ప్రదేశాల సుందరీకరణకు ఈ చర్యలు ఎలా దోహదపడతాయో ఇది రుజువు చేస్తోంది

 

 

ముందు

తర్వాత

  1. నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ సంస్థ కృష్ణశిల ప్రాంతంలోని తమ గనుల వద్ద పాత నూనె డ్రమ్ముల సృజనాత్మక పునర్వినియోగం ద్వారా “కృష్ణకుంజ్”కు అందమైన స్వాగత ఫలకాన్ని నిర్మించింది. పారవేత డ్రమ్ములకు ప్రకాశవంతమైన రంగులద్ది,   వాటిపై అక్షరాల అమరిక ద్వారా వ్యర్థాలను సమర్థంగా, ఆకర్షణీయ రీతిలో ప్రవేశ ద్వారంగా మార్చారు.

 

 

  1. సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన కొన్ని కీలక కార్యక్రమాలు:

 

 

 

 

కోర్బా ప్రాంతంలోని సింఘాలీ భూగర్భ గనిలో, నిర్మాణ స్థిరత్వం పెంపు సహా భూమి కుంగకుండా చూడటం కోసం ఫ్లై యాష్, పారిశ్రామిక వ్యర్థాలతో గోతులను ఎలా పూడ్చవచ్చో ప్రదర్శించేలా తుక్కు, పేస్ట్-ఫిల్ మైనింగ్ సిస్టమ్‌తో పనిచేసే నమూనాలను కార్మికులు రూపొందించారు.

కార్గిల్‌ యుద్ధం (1999)లో భాగంగా ‘ఆపరేషన్ విజయ్’ సమయంలో భారత సాయుధ దళాల త్యాగాలను సంస్మరిస్తూ కుస్ముంద ప్రాంతంలో సైనికుల బొమ్మలు, జాతీయ జెండాతో కూడిన టైగర్ హిల్ ప్రతిరూపాన్ని ఉద్యోగులు నిర్మించారు.

వ్యర్థాల తగ్గింపు, పునరుపయోగం, సుస్థిర జీవనశైలి పద్ధతులను ప్రోత్సహించే విధంగా భట్‌గావ్ ప్రాంతంలో ఓ గని కార్మికుడి బొమ్మ కేంద్రకంగా ‘కబాడ్‌ సే జుగాడ్’ పేరిట ఒక నిర్మాణాన్ని  రూపొందించారు.

  1. ఎస్‌సీసీఎల్‌ సంస్థ మందమర్రి ప్రాంతంలోని వ్యర్థాలు, తుక్కుతో రెండు విభిన్న సృజనాత్మక కళాకృతులను తీర్చిదిద్దింది. పవిత్ర చిహ్నాలు, సంప్రదాయ అంశాలతో అలంకరించిన శివలింగం, ప్రత్యేక త్రిశూల కళాకృతిని రూపొందించారు. సంస్థ ప్రాంగణంలో తుక్కు గుట్టలను తగ్గిస్తూ, వినూత్న పునర్వినియోగం ద్వారా ‘వ్యర్థం నుంచి అర్థం’ భావనకు కొత్త నిర్వచనమిచ్చింది.

 

 

ఈ సమగ్ర పారిశుధ్య కార్యకలాపాలు, వ్యర్థం నుంచి అర్థం సృష్టించే ఈ వినూత్న కార్యక్రమాలు సహా పటిష్ట పాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ రంగ సామర్థ్యం- సుస్థిరతల రీత్యా బొగ్గు మంత్రిత్వశాఖ ఉన్నత ప్రమాణాలను నెలకొల్పింది. ఈ మేరకు రికార్డు స్థాయిలో సాధించిన భౌతిక విజయాలను ఉద్యోగుల సంక్షేమం, పర్యావరణ పద్ధతులతో సృజనాత్మకంగా మేళవించింది. తద్వారా పరిపాలనలో నాణ్యత, వనరుల వినియోగం సహా స్వచ్ఛ భారత్ విస్తృత లక్ష్యాలపై తన అకుంఠిత దీక్షను మంత్రిత్వశాఖ సదా ప్రదర్శిస్తూనే ఉంది.

 

***


(రిలీజ్ ఐడి: 2333026) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil