ప్రధాన మంత్రి కార్యాలయం
సత్యం, జ్ఞానం, సత్ప్రవర్తనల ప్రాధాన్యాన్ని చాటే సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
05 NOV 2026 11:40AM by PIB Hyderabad
వ్యక్తులు, కుటుంబాలతో పాటు సమాజం మనుగడకు కీలకంగా నిలిచే విలువలను గురించి బోధిస్తున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఈ శ్లోకం.. సత్యంతో ధర్మాన్ని రక్షించవచ్చని, క్రమం తప్పని విద్యాభ్యాసం ద్వారా జ్ఞానాన్ని సంరక్షించవచ్చని, స్వచ్ఛతతో రూప సౌందర్యాన్ని కాపాడుకోవచ్చని, అలాగే మంచి నడవడిక ద్వారా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టవచ్చని బోధిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘సత్యేన రక్ష్యతే ధర్మో విద్యాభ్యాసేన రక్ష్యతే
మృజయా రక్ష్యతే రూపం కులం వృత్తేన రక్ష్యతే’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2333020)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5