బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అక్టోబర్ 2026లో సొంత, వాణిజ్య గనుల నుంచి నెలవారీ ఉత్పత్తి, రవాణా

నాడు పోస్టు చేయడమైనది: 02 NOV 2026 11:37AM by PIB Hyderabad

సొంత అవసరాలకు కేటాయించిన, వాణిజ్య గనుల నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అక్టోబర్ 2026లో బొగ్గు ఉత్పత్తి 22.03 మిలియన్ టన్నులకు (ఎంటీ) చేరుకుంది. అక్టోబర్ 2025లో నమోదైన 15.49 మిలియన్ టన్నులతో పోలిస్తే (సుమారు 42 శాతం వైఓవై) వృద్ధిని కనబరిచింది. బొగ్గు రవాణా కూడా అక్టోబర్ 2025లో 15.48 మిలియన్ టన్నుల నుంచి, అక్టోబర్ 2026 నాటికి 21.11 మిలియన్ టన్నులకు (సుమారు 36 శాతం వైఓవై వృద్ధి) పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు బొగ్గు ఉత్పత్తి 105.33 మిలియన్ టన్నుల నుంచి 117.23 మిలియన్ టన్నులకు, 11.30 శాతం వృద్ధి పెరిగింది. రవాణా 111.95 మిలియన్ టన్నుల నుంచి 124.86 మిలియన్ టన్నులకు 11.53 శాతం వృద్ధిని చేరుకోవటంతో ఈ రంగం స్థిరమైన వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఇది మైనింగ్ కార్యకలాపాల్లో నిలకడైన వృద్ధిని ప్రతిబింబిస్తుంది.

ఈ ప్రోత్సాహకరమైన ఫలితాలు మెరుగైన కార్యాచరణ సామర్థ్యం, మైనింగ్ ఉత్పాదకతను పెంపొందించటం, సొంత, వాణిజ్య బొగ్గు మైనింగ్ రంగంలో గనుల సామర్థ్యాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాయని తెలియజేస్తున్నాయి.

ఉత్పత్తి, రవాణాకు సంబంధించిన సమాచారాన్ని (మిలియన్ టన్నుల్లో) గ్రాఫ్ వివరిస్తుంది.

 

image.png

ఈ రంగానికి మరింత ఊతమిచ్చేలా జార్ఖండ్‌లోని లొహరి బొగ్గు గనికి అక్టోబర్ 2026లో ప్రారంభ అనుమతి లభించింది. ఈ గని వద్ద కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏళ్లుగా ఎదురుచూస్తోంది. దీనికి లభించిన ఆమోదం, మంత్రిత్వశాఖ చేపట్టిన సులభతర వ్యాపార సంస్కరణల ప్రభావాన్ని ప్రతిబింబిస్తోంది. దీనితో పనిచేస్తున్న సొంత, వాణిజ్య బొగ్గు గనుల సంఖ్య 87కి చేరింది.

ఈ గనుల నుంచి పెరుగుతున్న ఉత్పత్తి దిగుమతి చేసుకునే బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని, సరఫరా వ్యవస్థ స్థితిని బలోపేతం చేస్తుందని, విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేస్తుందని భావిస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన ముడిసరుకులో స్వయం సమృద్ధిని సాధించటం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ దృక్పథాన్ని ఇది ముందుకు తీసుకువెళ్తుంది.

సొంత, వాణిజ్య బొగ్గు మైనింగ్ పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు మంత్రిత్వశాఖ నిబద్ధతను స్పష్టం చేస్తూ.. ఉత్పత్తి వృద్ధిని నిలకడగా కొనసాగించటం, సరఫరా ఇబ్బందులను పరిష్కరించటం, ప్రగతిశీల విధానపరమైన చర్యలు, బలమైన నియంత్రణ పర్యవేక్షణ, భాగస్వాముల నిరంతర మద్దతుతో బొగ్గు లభ్యతను మెరుగుపరచటంపై దృష్టి సారిస్తుంది. తద్వారా దేశంలో పెరుగుతున్న ఇంధన, పారిశ్రామిక అవసరాలను తీర్చటంలో విశ్వసనీయమైన తోడ్పాటును అందించేందుకు కట్టుబడి ఉంది.

***


(రిలీజ్ ఐడి: 2332002) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil