నాడు పోస్టు చేయడమైనది:
01 NOV 2026 12:32PM by PIB Hyderabad
మధ్యప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా, ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు. మధ్యప్రదేశ్ వైభవోపేత వారసత్వం, సుసంపన్న సంస్కృతి, అద్భుత ప్రాకృతిక శోభతో అలరారే రాష్ట్రమని, ప్రపంచ ప్రఖ్యాతిని పొందిన ఆ రాష్ట్రంలోని వారసత్వ స్థలాలు రాష్ట్రానికి గల చరిత్రాత్మక గుర్తింపును పెంపొందింప చేస్తున్నాయని శ్రీ మోదీ అన్నారు.
‘‘మధ్యప్రదేశ్ ప్రజలు తమ ప్రతిభతో, కష్టించి పనిచేసే తత్వంతో ప్రతి రంగంలో అసాధారణ తోడ్పాటును అందిస్తున్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, పర్యటన, విద్య, మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలు.. ఇలా వివిధ రంగాలలో రాష్ట్రం నిరంతరం అనేక కొత్త విజయాలను సాధిస్తోంది’’ అని శ్రీ మోదీ ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
మధ్యప్రదేశ్‌కు చెందిన సోదరీ, సోదరులందరికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ హృదయపూర్వక శుభాకాంక్షలు.
మన ఈ రాష్ట్రం.. గౌరవశాలి వారసత్వం, సమృద్ధ సంస్కృతిలతో పాటు అద్భుత ప్రాకృతిక సౌందర్యానికి కూడా నిలయంగా ఉన్నది. ఇక్కడి విశ్వవిఖ్యాత వారసత్వ స్థలాలు రాష్ట్ర చరిత్రాత్మక గుర్తింపును వర్ధిల్లజేస్తున్నాయి.
మధ్యప్రదేశ్ ప్రజలు ప్రతిభతో, కష్టపడి పనిచేసే స్వభావంతో అన్ని రంగాలలో చెప్పుకోదగిన తోడ్పాటును అందిస్తున్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, పర్యటన, విద్య, మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలు.. ఇలా వివిధ రంగాలలో నిరంతరం విజయాలను సాధిస్తున్నారు. వారు తమ సర్వతోముఖ అభివృద్ధితో, స్వయంసమృద్ధ భారత్ నిర్మాణంలో కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు.
ఈ విశిష్ట సందర్భంలో.. రాష్ట్రంలోని నా కుటుంబ సభ్యుల జీవితాలలో సుఖ, శాంతులతో పాటు సమృద్ధి కలగాలని నేను కోరుకుంటున్నాను.’’
***