ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బెంగళూరు-ముంబయి వందేభారత్ స్లీపర్ రైలు... రైళ్ల అనుసంధానతకు కీలకమన్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 01 NOV 2026 6:35PM by PIB Hyderabad

రైళ్ల అనుసంధానతకు బెంగళూరు-ముంబయి వందేభారత్ స్లీపర్ రైలు మరింత ఊతమిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బెంగళూరు, ముంబయి మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తూ, అంతర్రాష్ట్ర అనుసంధానాన్ని పెంపొందిస్తూ వందేభారత్ స్లీపర్ రైలు కీలక ఘట్టంగా నిలుస్తుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ముఖ్యంగా యువత, ఐటీ నిపుణులు, విద్యార్థులకు ఈ రైలు సర్వీసు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

సాంకేతికత, నూతన ఆవిష్కరణల నగరమైన బెంగళూరు నుంచి మెరుగైన రైలు అనుసంధానత దిశగా మరో ముందడుగు పడింది.

ఈ వందేభారత్ స్లీపర్ రైలు బెంగళూరు-ముంబయి మధ్య అనుసంధానతను పూర్తిగా మార్చేస్తుంది.

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ముఖ్యంగా యువత, ఐటీ నిపుణులు, విద్యార్థులకు ఈ రైలు సర్వీసు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2331479) సందర్శకుల సూచీ సంఖ్య : : 9