నాడు పోస్టు చేయడమైనది:
30 OCT 2026 9:11PM by PIB Hyderabad
ట్రాన్స్‌భారత్ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు చెందిన వీటీ-హెచ్‌సీఎక్స్ రిజిస్ట్రేషన్ నంబరు కలిగిన ఏఎస్350బీ3 రకం హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ సమీపంలో చాయ్ గ్రామం వద్ద అటవీ ప్రాంతంలో 2026 అక్టోబర్ 30న ప్రమాదానికి గురై కూలిపోయింది.
ఈ హెలికాప్టర్ మధ్యాహ్నం 1.14 గంటలకు బద్రీనాథ్ హెలిప్యాడ్ నుంచి బయలుదేరి, డెహ్రాడూన్‌లోని సహస్రధార హెలిప్యాడ్‌కు వెళ్తోంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఒక పైలట్, అయిదుగురు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద స్థలంలో హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రమాదంపై ప్రాథమిక విచారణ, నిబంధనల ప్రకారం అంచనా వేయడానికి పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) బృందాన్ని డెహ్రాడూన్‌కు పంపించింది.
***