నాడు పోస్టు చేయడమైనది:
27 OCT 2026 11:07PM by PIB Hyderabad
లికటెంస్టీన్ వంశ పారంపర్య రాజకుమారుడు శ్రీ ఎలాయిస్తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు.
భారత్, లికటెంస్టీన్ల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అనేక విషయాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు శ్రీ మోదీ తెలిపారు.
భారత్-ఈఎఫ్టీఏ వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టీఈపీఏ)లో చోటు చేసుకున్న పురోగతిని ఇద్దరు నేతలు సమీక్షించారు. ఈ ఒప్పందం కుదిరి ఇప్పటికి ఒక సంవత్సరం పూర్తి అయింది. పెట్టుబడులను పెంపొందింప చేసుకోవడానికి, ఆర్థిక సహకారాన్ని మరింత పటిష్టపరుచుకోవడానికి ఉన్న అవకాశాలపై కూడా నేతలు చర్చించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘లికటెంస్టీన్ వంశ పారంపర్య రాజకుమారుడు శ్రీ ఎలాయిస్తో సమావేశం ఎంతో ఫలప్రదంగా ముగిసింది.
అనేక విషయాలను మేం చర్చించాం. వివిధ రంగాలలో భారత్, లికటెంస్టీన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ఇప్పటి కన్నా మరింత బలోపేతం చేసుకొనే అంశంపై మేం దృష్టిని కేంద్రీకరించాం.
చరిత్రాత్మక భారత్-ఈఎఫ్టీఏ వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టీఈపీఏ) కుదిరి ఒక సంవత్సరం పూర్తి అయిన నేపథ్యంలో, ఆ ఒప్పందంలో భాగంగా ఇప్పటి వరకు నమోదైన ప్రగతిని సమీక్షించాం. దీంతో పాటు, అధిక పెట్టుబడి, పరస్పర ఆర్థిక సహకారాన్ని పెంపొందింప చేసుకొనేందుకు ఉన్న అవకాశాలు కూడా మా చర్చలలో ప్రస్తావనకు వచ్చాయి.’’
***