నాడు పోస్టు చేయడమైనది:
26 OCT 2026 12:13PM by PIB Hyderabad
లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల మధ్య పార్లమెంటరీ చర్చ, సహకారాన్ని పటిష్టపరచడంలో 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ భూమికకున్న ప్రాధాన్యాన్ని శ్రీ ఓమ్ బిర్లా తన వ్యాసంలో వివరించారు. ఈ ఫోరమ్.. ఈ సంవత్సరం బ్రిక్స్‌కు అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తున్న భారత్ ప్రతిపాదించిన నాలుగు కీలక అంశాల మార్గదర్శకత్వంలో సంస్థాగత పటిష్టీకరణ, కృత్రిమ మేధ ఆధారిత పాలన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య పరస్పర సహకారం, సుస్థిరత్వం వంటి అంశాలపై చర్చించనుంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ, ఇలా పేర్కొంది
‘‘సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల మధ్య పార్లమెంటరీ చర్చ, సహకారాన్ని పటిష్టపరచడంలో 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ భూమికకున్న ప్రాధాన్యాన్ని శ్రీ ఓమ్ బిర్లా తన వ్యాసంలో వివరించారు.
ఈ ఫోరమ్.. ఈ సంవత్సరం బ్రిక్స్‌కు అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తున్న భారత్ ప్రతిపాదించిన నాలుగు కీలక అంశాల మార్గదర్శకత్వంలో సంస్థాగత పటిష్టీకరణ, కృత్రిమ మేధ ఆధారిత పాలన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య పరస్పర సహకారం, సుస్థిరత్వం వంటి అంశాలపై చర్చించనుంది.’’