నాడు పోస్టు చేయడమైనది:
23 OCT 2026 7:17PM by PIB Hyderabad
పారా ఆసియా క్రీడల పురుషుల డబుల్స్ క్లాస్ ఎండీ4 విభాగంలో కాంస్య పతకం సాధించిన జెహాన్ దొరాబ్ మదన్, శుభమ్ వధ్వాకు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఈ క్రీడల్లో సంబంధిత విభాగంలో భారతదేశానికి ఇది మొట్టమొదటి పతకమని పేర్కొంటూ ఈ చారిత్రాత్మక విజయాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. వారు భవిష్యత్తులోనూ మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
"పారా ఆసియా క్రీడల పురుషుల డబుల్స్ క్లాస్ ఎండీ4 విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న జెహాన్ దొరాబ్ మదన్, శుభమ్ వధ్వాకు అభినందనలు! ఈ పోటీల్లో సంబంధిత విభాగంలో భారత్‌కు దక్కిన మొట్టమొదటి పతకంగా వీరి విజయం చరిత్ర సృష్టించింది. రాబోయే రోజుల్లో వారు మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను: PM @narendramodi“