ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా క్రీడల్లో రజత పతకం సాధించిన ప్రమోద్‌కు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 23 OCT 2026 7:14PM by PIB Hyderabad

ఆసియా పారా క్రీడల్లో పురుషుల 1500 మీటర్ల టీ46 ఈవెంట్‌లో రజత పతకం సాధించిన ప్రమోద్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

గత ఎడిషన్‌లోనూ రజతం సాధించిన ప్రమోద్.. ఈసారి కూడా ఆ విజయాన్ని పునరావృతం చేయటం అద్భుతమని శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. ఆయన క్రీడా ప్రయాణంలో భవిష్యత్తులోనూ మరింతగా రాణించాలని, ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.

“ఆసియా పారా క్రీడల్లో పురుషుల 1500 మీటర్ల టీ46 ఈవెంట్‌లో రజత పతకం సాధించిన ప్రమోద్‌కు అభినందనలు. గత ఎడిషన్‌లోనూ రజతం సాధించిన ప్రమోద్.. ఈసారి కూడా ఆ విజయాన్ని పునరావృతం చేయటం అద్భుతం. ఆయన క్రీడా ప్రయాణంలో భవిష్యత్తులో మరింతగా రాణించాలని, అందరికీ స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నా: పీఎం @narendramodi”


(రిలీజ్ ఐడి: 2327944) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam