నాడు పోస్టు చేయడమైనది:
23 OCT 2026 7:19PM by PIB Hyderabad
ఆసియా పారా గేమ్స్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 విభాగంలో స్వర్ణం సాధించి, చిరస్మరణీయ అరంగేట్రం చేసిన నవీన్ శివకుమార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
నవీన్ అద్భుత ప్రదర్శన దేశానికి మరింత కీర్తిని తెచ్చిపెట్టిందనీ, ఆయన మరెన్నో విజయాలను సాధిస్తూ తోటి క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
"ఆసియా పారా గేమ్స్‌లో నవీన్ శివకుమార్ చిరస్మరణీయ అరంగేట్రం!
పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4లో స్వర్ణం గెలిచిన నవీన్ శివకుమార్‌కు అభినందనలు. ఆయన అద్భుత ప్రదర్శన దేశానికి మరింత కీర్తిని తెచ్చిపెట్టింది. నవీన్ మరిన్ని కొత్త మైలురాళ్లను సాధిస్తూ తోటి క్రీడాకారులకు స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నా: ప్రధానమంత్రి @narendramodi"