ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారా క్రీడల్లో రజత పతకం సాధించిన నిత్య శ్రీ సుమతి శివన్‌కు ప్రధానమంత్రి అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
23 OCT 2026 7:22PM by PIB Hyderabad
ఆసియా పారా క్రీడల్లో మహిళల సింగిల్స్ ఎస్‌హెచ్6 విభాగంలో రజత పతకం సాధించిన నిత్య శ్రీ సుమతి శివన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
గత ఆసియా పారా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన ఆమె.. ఈసారి రజత పతకం గెలుచుకోవడం గొప్ప విజయమని ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఆమె ఇదే స్ఫూర్తితో రాణిస్తూ దేశానికి మరిన్ని పతకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
‘‘ఆసియా పారా క్రీడల్లో మహిళల సింగిల్స్ ఎస్‌హెచ్6 విభాగంలో రజత పతకం సాధించిన నిత్య శ్రీ సుమతి శివన్‌కు అభినందనలు. గత పోటీల్లో కాంస్య పతకం సాధించిన ఆమె.. ఈసారి రజత పతకం గెలుచుకోవడం గొప్ప విజయం. ఆమె భవిష్యత్తులోనూ అద్భుతంగా రాణిస్తూ దేశానికి మరిన్ని విజయాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2327939)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam