నాడు పోస్టు చేయడమైనది:
23 OCT 2026 10:19PM by PIB Hyderabad
ఆసియా పారా గేమ్స్ పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్11 ఈవెంట్‌లో కాంస్యం గెలిచిన హిమాన్షు నందల్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
ఈ ఎడిషన్‌లో హిమాన్షు మూడు కాంస్య పతకాలు సాధించి అద్భుత ప్రదర్శన కనబరిచారని శ్రీ మోదీ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ హిమాన్షు ఇలాగే రాణిస్తూ, మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఆయన భవిష్యత్ ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
"ఆసియా పారా గేమ్స్ పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్11 ఈవెంట్‌లో కాంస్యం గెలిచిన హిమాన్షు నందల్‌కు అభినందనలు! ఈ ఎడిషన్‌లో మూడు కాంస్య పతకాలతో ఆయన అద్భుత ప్రదర్శన కనబరిచారు. భవిష్యత్తులోనూ హిమాన్షు ఇలాగే రాణిస్తూ, మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆశిస్తున్నా. ఆయన భవిష్యత్ ప్రయాణానికి శుభాకాంక్షలు : ప్రధానమంత్రి @narendramodi"