ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా క్రీడల్లో రజత పతకం సాధించిన నిమిషా చక్కుంగల్పరంబిల్ సురేష్‌కు ప్రధానమంత్రి అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 23 OCT 2026 10:31PM by PIB Hyderabad

ఆసియా పారా క్రీడల్లో మహిళల లాంగ్‌ జంప్‌ టీ47 విభాగంలో రజత పతకం సాధించిన నిమిషా చక్కుంగల్పరంబిల్‌ సురేశ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

 

ఆమె అంకితభావం, కఠోర శ్రమ భారత పారా క్రీడాకారులకు మరో గర్వకారణమైన విజయాన్ని అందించాయని ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఆమె మరిన్ని విజయాలు సాధిస్తూ రాణించాలని ఆకాంక్షించారు. రాబోయే పోటీల్లో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

 

ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.

 

‘‘ఆసియా పారా క్రీడల్లో మహిళల లాంగ్‌ జంప్‌ టీ47 విభాగంలో రజత పతకం సాధించిన నిమిషా చక్కుంగల్పరంబిల్‌ సురేశ్‌కు అభినందనలు. ఆమె అంకితభావం, కఠోర శ్రమ భారత పారా క్రీడాకారులకు మరో గర్వకారణమైన విజయాన్ని అందించాయి. ఆమె ఇలాగే రాణిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. భవిష్యత్తులో జరిగే పోటీల్లో ఆమెకు శుభాకాంక్షలు’’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2327926) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Gujarati , Malayalam