నాడు పోస్టు చేయడమైనది:
23 OCT 2026 10:23PM by PIB Hyderabad
ఆసియా పారా క్రీడల్లో పురుషుల 200 మీటర్ల టీ37 విభాగంలో కాంస్య పతకం సాధించిన రాకేష్‌భాయ్ భట్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఈ పోటీల్లో రెండు కాంస్య పతకాలు సాధించి రాకేష్‌భాయ్ దేశానికి గర్వకారణంగా నిలిచారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆయన భవిష్యత్తులోనూ మరింత రాణిస్తూ ఎన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
“ఆసియా పారా క్రీడల్లో పురుషుల 200 మీటర్ల టీ37 విభాగంలో కాంస్య పతకం సాధించిన రాకేష్‌భాయ్ భట్‌కు అభినందనలు! ఈ పోటీల్లో రెండు కాంస్య పతకాలు సాధించి ఆయన దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఆయన ఇలాగే రాణిస్తూ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. రాబోయే సంవత్సరాల్లోనూ ఆయనకు మరిన్ని విజయాలు లభించాలని కోరుకుంటున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్టు ఆయన కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేసింది.