నాడు పోస్టు చేయడమైనది:
22 OCT 2026 6:07PM by PIB Hyderabad
ఆసియా పారా క్రీడలు-2026లో పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 పారా బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్యం సాధించిన సుహాస్ ఎల్ యతిరాజ్‌కు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలియజేశారు.
అతని నిలకడ, పట్టుదల, క్రీడ పట్ల ఉన్న అంకితభావం ప్రశంసనీయమని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ విజయం సాధించిన సుహాస్‌కు అభినందనలు తెలియజేశారు. ఇలాగే రాణిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘అంతర్జాతీయ క్రీడా వేదికపై సుహాస్ ఎల్. యతిరాజ్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు!
ఆసియా పారా క్రీడలు-2026లో పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 పారా బ్యాడ్మింటన్ విభాగంలో ఆయన కాంస్యం గెలుచుకున్నారు.
ఆయన నిలకడ, పట్టుదల, క్రీడ పట్ల అంకితభావం ప్రశంసనీయం.
ఈ విజయం సాధించిన సుహాస్‌కు అభినందనలు. ఇలాగే రాణిస్తూ... స్ఫూర్తిగా నిలుస్తారని ఆకాంక్షిస్తున్నాను: పీఎం @narendramodi’’
***