నాడు పోస్టు చేయడమైనది:
22 OCT 2026 6:28PM by PIB Hyderabad
ఆసియా పారా క్రీడల్లో మహిళల సింగిల్స్ ఎస్ఎల్ 3 పారా బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్యం సాధించి తనదైన ముద్ర వేసిన సంజనా కుమారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
ఆమె సాధించిన విజయానికి తాను గర్వపడుతున్నాననీ, భవిష్యత్తులోనూ ఆమె మరింత రాణించాలని ఆశిస్తున్నాననీ శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘ఆసియా పారా క్రీడల్లో సంజనా కుమారి తనదైన ముద్ర వేశారు. మహిళల సింగిల్స్ ఎస్ఎల్3 పారా బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్యం సాధించిన ఆమెను చూసి గర్విస్తున్నాను. భవిష్యత్తులోనూ ఆమె మరింత రాణించాలని ఆశిస్తున్నాను: పీఎం నరేంద్ర మోదీ’’
***