నాడు పోస్టు చేయడమైనది:
22 OCT 2026 5:27PM by PIB Hyderabad
పారా ఆసియా క్రీడల మహిళల డబ్ల్యూ1 ఆర్చరీ విభాగంలో రజత పతకం సాధించిన స్వాతి చౌదరికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు. ఈ విభాగంలో తన అరంగేట్రంలోనే భారతదేశానికి మొట్టమొదటి పతకాన్ని అందించి ఆమె చరిత్ర సృష్టించారు.
ఇది ఎంతో ప్రత్యేకమైన విజయమన్న ప్రధాని.. ఆమె పట్టుదల నిజంగా ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. ఆమె భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తూ దేశం గర్వించేలా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
"పారా ఆర్చరీలో భారతదేశానికి అత్యంత ప్రత్యేకమైన విజయం!
పారా ఆసియా క్రీడల్లో మహిళల డబ్ల్యూ1 ఆర్చరీ విభాగంలో స్వాతి చౌదరి తన అరంగేట్రంలోనే రజత పతకాన్ని సాధించి భారతదేశానికి మొట్టమొదటి పతకాన్ని అందిస్తూ చరిత్ర సృష్టించారు. ఆమె పట్టుదల నిజంగా ప్రశంసనీయం. ఆమె ఇలాగే దేశం గర్వించేలా విజయాలు సాధించాలి: PM @narendramodi"