ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా క్రీడల్లో కాంస్యం సాధించిన అభిజీత్ సఖూజాకు ప్రధానమంత్రి అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 22 OCT 2026 6:13PM by PIB Hyderabad

ఆసియా పారా క్రీడలు–2026లో పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 పారా బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్యం సాధించిన అభిజిత్ సఖూజాను ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

తొలి ప్రయత్నంలోనే పోడియంను చేరుకోవడం... ఆయన ప్రతిభనూ, అంకితభావాన్నీ, కృషినీ ప్రతిబింబించే ప్రశంసనీయమైన విజయమని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ క్రీడలో ఆయనకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

‘‘అభిజిత్ సఖూజా అద్భుతమైన అరంగేట్రం!

ఆసియా పారా క్రీడలు–2026లో పురుషుల సింగిల్స్ పారా బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్యం సాధించినందుకు అభినందనలు. తొలి ప్రయత్నంలోనే పతకం సాధించడం ప్రశంసనీయమైన విజయం. ఇది అతని ప్రతిభకూ, అంకితభావానికీ, కృషికీ నిదర్శనం. ఈ క్రీడలో అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను: పీఎం @narendramodi’’

***


(రిలీజ్ ఐడి: 2327233) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam