ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా క్రీడల్లో రజతం సాధించిన మహమ్మద్ బసిల్ ఎమ్‌ను అభినందించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 21 OCT 2026 7:37PM by PIB Hyderabad

ఆసియా పారా క్రీడలు-2026లో పురుషుల 100 మీటర్ల టీ47 విభాగంలో అత్యుత్తమ టైమింగ్‌తో రజతం సాధించి, తనదైన ముద్ర వేసిన మహమ్మద్ బసిల్ ఎమ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలియజేశారు.

హీట్స్‌లో గేమ్ రికార్డులను బద్దలు కొట్టి, ఫైనల్లో తన సొంత రికార్డును మరింత మెరుగుపరచుకోవడం అద్భుతమైన ప్రతిభకు, పట్టుదలకు నిదర్శనమని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ చిరస్మరణీయ విజయం సాధించిన బసిల్‌ను ప్రశంసించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

‘‘ఆసియా పారా క్రీడలు-2026లో పురుషుల 100 మీటర్ల టీ47 విభాగంలో అత్యుత్తమ టైమింగ్‌తో రజతం సాధించి మహమ్మద్ బసిల్ ఎమ్ తనదైన ముద్ర వేశారు. హీట్స్‌లో గేమ్ రికార్డును బద్దలు కొట్టిన ఆయన... ఫైనల్లో తన సొంత రికార్డును మరింత మెరుగుపరుచుకున్నారు. ఇది అద్భుతమైన ప్రతిభకు, పట్టుదలకు నిదర్శనం. ఈ చిరస్మరణీయ ప్రదర్శన చేసిన బసిల్‌కు నా అభినందనలు: పీఎం నరేంద్ర మోదీ’’

 

***


(రిలీజ్ ఐడి: 2326594) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam