ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారాక్రీడల్లో రజతం గెలుచుకున్న శీతల్ దేవి, పాయల్ నాగ్‌కు ప్రధాని అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 21 OCT 2026 6:34PM by PIB Hyderabad

ఆసియా పారా క్రీడలు-2026లో మహిళల పారా కాంపౌండ్ డబుల్స్ విభాగంలో రజతం సాధించిన శీతల్ దేవి, పాయల్ నాగ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

బృందస్ఫూర్తినీ, అత్యుత్తమ క్రీడా నైపుణ్యాన్నీ ప్రదర్శిస్తూ దేశాన్ని గర్వపడేలా చేశారని ప్రశంసించారు. ఇద్దరు అథ్లెట్లు భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

‘‘బృంద స్ఫూర్తికీ, క్రీడా నైపుణ్యానికీ చక్కని నిదర్శనం!

ఆసియా పారా క్రీడలు-2026లో మహిళల పారా కాంపౌండ్ డబుల్స్ విభాగంలో రజతం సాధించిన శీతల్ దేవి, పాయల్ నాగ్‌కు అభినందనలు! క్రీడాకారిణులు ఇద్దరూ దేశాన్ని గర్వపడేలా చేశారు. భవిష్యత్తులో వారు చేపట్టే ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను: పీఎం నరేంద్రమోదీ’’

***


(రిలీజ్ ఐడి: 2326574) సందర్శకుల సూచీ సంఖ్య : : 9