ప్రధాన మంత్రి కార్యాలయం
వినయానికీ, నిరంతరం నేర్చుకోవడానికీ ఉన్న ప్రాధాన్యాన్ని చెబుతున్న సంస్కృత సుభాషితం.. ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
22 OCT 2026 7:49AM by PIB Hyderabad
పరిమిత విజయం దక్కిన సందర్భాల్లో వినయంతో మసలుకోవడం, నిరంతరమూ నేర్చుకుంటూనే ఉండటం, జీవితంలో పురోగమించడానికి ఉన్న ప్రాధాన్యాన్ని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘ఖద్యోతో ద్యోతతే తావద్ యావన్నోదయతే శశీ
ఉదితే తు సహస్రాంశౌ న ఖద్యోతో న చంద్రమాః’’ అని పేర్కొన్నారు.
పైన ప్రస్తావించిన శ్లోకానికి అర్థం ఇదీ..
మిణుగురు పురుగు చందమామ కనుపించని కాలంలో మాత్రమే మెరుస్తూ కనిపిస్తుంది. కానీ, సూర్యోదయమైతే మిణుగురు కాంతీ కనుపించదూ, చందమామా కానరాదు. ఇదే మాదిరిగా, ఏదైనా చిన్న విజయానికి ప్రాధాన్యం.. దాని కన్న పెద్ద విజయమేదైనా ముందుకు రానంత వరకు మాత్రమే ఉంటుంది. ఈ కారణంగా, పరిమిత విజయం దక్కడంతోనే అహంకారంతో ప్రవర్తించడానికి బదులు అణకువతో నడుచుకోవాలి. ఎల్లవేళలా నేర్చుకుంటూ జీవితంలో ముందుకు సాగాలి.
***
(రిలీజ్ ఐడి: 2326447)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6