బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గనుల సుస్థిర పునరుపయోగాన్ని ప్రోత్సహించే సీసీఓ ‘సువికల్ప్’ కార్యక్రమం.. స్కోచ్ గోల్డ్ అవార్డ్-2026 ప్రదానం

నాడు పోస్టు చేయడమైనది: 21 OCT 2026 12:47PM by PIB Hyderabad

గనులను శాస్త్రీయ పద్ధతిలో మూసివేసి, గని తవ్వకాలు పూర్తి అయిన తరువాత భూమిని నిరంతర ఉపయోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధీనంలోని కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ (సీసీఓ) పలు కార్యక్రమాలను అమలుచేస్తోంది.

 

సువ్యవస్థితమైన, డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకొనే ప్రక్రియ ద్వారా పునరుపయోగానికి ఉపయోగపడగల గని ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవడంలో ఆసక్తిదారు సంస్థలకు సాయపడేందుకు ‘సువికల్ప్’ పేరిట ఓ సంస్థాగత గని పునరుపయోగ ఉపకరణాన్ని సీసీఓ తీసుకువచ్చింది. ఈ ఉపకరణం సాంకేతికత, పర్యావరణం, సామాజిక, ఆర్థిక ప్రమాణాలను ఆధారం చేసుకొని పునరుపయోగ ప్రాజెక్టులను మదింపు చేసి, ర్యాంకులను ఇస్తుంది.

 

తగిన ప్రాజెక్టును గుర్తించిన తరువాత, వినియోగదారు సంస్థలు ‘ప్రిజమ్’ (పోస్ట్-మైనింగ్ రీపర్పసింగ్ ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ మాడల్‌కు సంక్షిప్త రూపమిది)ను ఉపయోగించి అమలుకు సంబంధించిన వివిధ ప్రత్యామ్నాయాలను అన్వేషించవచ్చు. ప్రాజెక్టు రూపాలు, అమలు విధానాలు, కేస్ స్టడీస్, నమూనా డీపీఆర్‌లు (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌స్), టెండర్ డాక్యుమెంట్లతో పాటు అవే రంగాలలో పనిచేస్తున్న ఏజెన్సీల తాలూకు సమాచారాన్ని ‘ప్రిజమ్’ అందిస్తుంది.   

 వినూత్నత, ప్రభావశీలత్వం పరంగా ‘సువికల్ప్’కు కిందటి నెల 26న జాతీయ స్థాయిలో ‘‘డిజిటల్ ఆపరేషనల్ ఎఫీషియెన్సీ-డేటా ఆధారితంగా నిర్ణయాలను తీసుకోవడం’’ కేటగిరీలో స్కోచ్ గోల్డ్ అవార్డును ఇచ్చారు. విశిష్ట పనితీరును గుర్తించడానికి ఈ స్కోచ్ అవార్డులను ఇస్తున్నారు. ఈ అవార్డులను ఇవ్వడం ద్వారా.. పాలన, సాంకేతికత, నూతన ఆవిష్కరణలతో పాటు ప్రజాహితానికి తోడ్పడే కీలక మార్పులకు దన్నుగా నిలిచే కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు.

 

గనులను మూసివేయడం, వాటిని మన్నికైన రీతిలో ప్రత్యామ్నాయ పద్దతులలో ఉపయోగించుకోవడానికి విషయాలు తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవడంలో సాయపడడానికి సువ్యవస్థీకృత జ్ఞాన భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణ పెంపు సంబంధిత కార్యక్రమం కింద ‘సువికల్ప్ సంవాద్ వెబినార్ సిరీస్’ను కూడా సీసీఓ ఆరంభించింది. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ సిరీస్‌ బొగ్గు కంపెనీలు, ప్రభుత్వ అధికారులు, సాంకేతిక నిపుణులు, విద్యాసంస్థలతో పాటు ఇతర ఆసక్తిదారులకు గని మూసివేత అనంతర భూమి ఉపయోగానికి సంబంధించిన ఆచరణసాధ్య పరిష్కారాలు, కొత్త కొత్త నమూనాలు, అత్యుత్తమ పద్ధతులను పంచుకోవడానికి ఒక చోట సమావేశపరిచింది.

 

ఈ సిరీస్‌లో 12 ఇతివృత్త ప్రధాన వెబినార్లను నిర్వహించారు. ఈ ఇతివృత్తాలలో.. ‘రీక్లెయిమ్’ ఎల్.ఐ.వి.ఇ.ఎస్. ఫ్రేంవర్కులు, సువికల్ప్ మైన్ రీపర్పసింగ్ టూల్, పీఎమ్‌యూను ఏర్పాటు చేయడం, సమాజ భాగస్వామ్యం, పర్యటన, పర్యటక స్థలాల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, ఆర్థిక సహాయ యంత్రాంగాలు, విడచిపెట్టిన గనులలోని ఖాళీ ప్రదేశాలను కొత్త పద్దతుల్లో ఉపయోగించడంతో పాటు గని ప్రదేశం మార్పులతో ముడిపడిన జాతీయ, అంతర్జాతీయ అనుభవాలు.. ఉన్నాయి.

గనుల మూసివేతతో ముడిపడిన బహుళవిధ కార్యక్రమాలపై బొగ్గు కంపెనీల సంస్థాగత అవగాహనను ఈ సిరీస్ పటిష్ఠపరిచింది. దీంతో నియంత్రణకు సంబంధించిన నియమాల పాలనకు మించి పర్యావరణ పునరుద్ధరణ, బతుకుదెరువు అవకాశాల కల్పన, సామాజిక పురోగతి, ఆర్థిక వివిధీకరణ వంటి రంగాలకు ప్రోత్సాహం లభించింది. నిపుణుల సారథ్యంలో చర్చలు జ్ఞాన మార్పిడి.. మన్నికైన పునరుపయోగ ప్రాజెక్టుల గురించి పథక రచన చేయడం, ఆ పథకాల అమలుకు ఆచరణీయ దృక్పథాన్ని అనుసరించడంతో పాటు విస్తరణ యోగ్య విధానాలకు దోహదం చేశాయి.

 

ఈ కార్యక్రమాలు మూసివేసిన గనులను ఫలప్రద సంపదగా మార్చడంతో పాటు, నిరంతర ప్రాతిపదికన ప్రాంతీయాభివృద్ధికి దన్నుగా నిలవాలన్న దార్శనికతను ప్రోత్సహిస్తున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2326024) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil