ప్రధాన మంత్రి కార్యాలయం
పోలీసు సంస్మరణ దినోత్సవం.. పోలీసు సిబ్బందికి ప్రధానమంత్రి నివాళులు
నాడు పోస్టు చేయడమైనది:
21 OCT 2026 8:23AM by PIB Hyderabad
పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు సిబ్బందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. చట్టాన్ని పరిరక్షించడంలో, నేరాలను అరికట్టడంలో, అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందించడంతో పాటు అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ పౌరుల భద్రతకు పూచీపడడంలో పోలీసు ఉద్యోగులు అమూల్యమైన తోడ్పాటును అందిస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు.
కర్తవ్య నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు ఉద్యోగులకు శ్రీ మోదీ మనస్పూర్తిగా శ్రద్ధాంజలి ఘటించారు. వారి ధైర్య, సాహసాలు, అచంచల అంకిత భావం, సర్వోన్నత త్యాగం దేశ ప్రజల మనసులో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకుంటూ:
‘‘తరచు అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ అసాధారణ నిబద్ధతతో సేవలను అందిస్తున్న మన పోలీసు సిబ్బందికి ప్రగాఢ కృతజ్ఞతలను తెలియజేసుకొనే సందర్భం ‘పోలీసు సంస్మరణ దినోత్సవం’. శాంతి భద్రతలను కాపాడడం మొదలు.. నేరాన్ని అరికట్టడం, అత్యవసర పరిస్థితులకు దీటుగా స్పందించడంతో పాటు ప్రజల భద్రతను పరిరక్షించడం వరకు.. వారు అందిస్తున్న సేవలు అమూల్యం.
కర్తవ్య పాలనలో ప్రాణాలను అర్పించిన పోలీసు ఉద్యోగులకు మనం మనస్పూర్తిగా శ్రద్ధాంజలి ఘటిద్దాం. వారి సాహసం, అచంచల అంకితభావం, సర్వోన్నత త్యాగం దేశ ప్రజల మనసులో ఎప్పటికీ స్థిరంగా నిలిచి ఉంటాయి’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2325765)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7