రక్షణ మంత్రిత్వ శాఖ
డీబీఐఎం మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన రక్షణ మంత్రిత్వ శాఖ, రక్షణ విభాగం వెబ్‌సైట్లను ప్రారంభించిన రక్షణ కార్యదర్శి
నాడు పోస్టు చేయడమైనది:
19 OCT 2026 5:16PM by PIB Hyderabad
పునరుద్ధరించిన రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఓడీ), రక్షణ విభాగం (డీఓడీ) వెబ్‌సైట్లను రక్షణ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ 2026 అక్టోబర్ 19న ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతతో, అందరికీ సులభంగా అందుబాటులో ఉండేలా, వినియోగదారులకు అనుకూలంగా రూపొందించిన ఈ వెబ్‌సైట్లు డిజిటల్ బ్రాండ్ ఐడెంటిటీ మాన్యువల్ (డీబీఐఎం) 3.0, భారత ప్రభుత్వ వెబ్‌సైట్ల మార్గదర్శకాలు (జీఐజీడబ్ల్యూ) 3.0 నిబంధనలకు పూర్తి అనుగుణంగా ఉన్నాయి.
ఈ వెబ్‌సైట్ల ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ విధానాలు, కార్యక్రమాలు, కార్యకలాపాలు, నోటిఫికేషన్లు, రక్షణ రంగానికి సంబంధించిన తాజా సమాచారం, ఇతర కీలక వివరాలను పౌరులు, భాగస్వామ్య సంస్థలు, వినియోగదారులు సులభంగా పొందవచ్చు. విస్తృత స్థాయిలో ప్రజలకు సమాచారం చేరడంతో పాటు, అందరికీ సౌలభ్యంగా ఉండేలా ఈ వెబ్‌సైట్లలో 22 భారతీయ అధికారిక భాషల్లో సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. ఈ వెబ్‌సైట్‌ను www.mod.gov.in ద్వారా సందర్శించవచ్చు.
సురక్షితమైన, ఆధునిక డిజిటల్ వేదిక ద్వారా పారదర్శకత, సమర్థత, అందరికీ సమాచార లభ్యత, పౌర కేంద్రితంగా సమాచార పంపిణీని ప్రోత్సహించే ఈ కార్యక్రమం డిజిటల్ ఇండియా, ఈ - గవర్నెన్స్‌పై కేంద్ర ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2325305)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10