ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారా క్రీడలు 2026లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్హెచ్1విభాగంలో రజత పతకాన్ని సాధించిన అవని లేఖరాకు ప్రధానమంత్రి అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
19 OCT 2026 1:15PM by PIB Hyderabad
ఆసియా పారా క్రీడలు–2026లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్హెచ్1 విభాగంలో రజత పతకం సాధించిన అవని లేఖరాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
అద్భుతమైన స్కోరు సాధించడంతో పాటు, నిలకడైన ప్రదర్శన, దృఢ సంకల్పంతో అవని లేఖరా దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఆమె భవిష్యత్తులో చేపట్టే ప్రయత్నాల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
‘‘అవని లేఖరా అద్భుతమైన రజత పతకాన్ని సాధించారు.
ఆసియా పారా క్రీడలు–2026లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్హెచ్1 విభాగంలో అద్భుతమైన స్కోరుతో రజత పతకం సాధించిన ఆమెకు అభినందనలు. నిలకడైన ప్రదర్శన, దృఢ సంకల్పంతో ఆమె దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. భవిష్యత్తులో ఆమె చేపట్టే ప్రయత్నాల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’
(రిలీజ్ ఐడి: 2325248)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Urdu
,
English
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam