ప్రధాన మంత్రి కార్యాలయం
2026 ఆసియా పారా క్రీడల్లో పాల్గొంటున్న భారత బృందానికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
18 OCT 2026 5:57PM by PIB Hyderabad
ఐచి - నగోయాలో ప్రారంభమైన 2026 ఆసియా పారా క్రీడల్లో పాల్గొంటున్న భారత బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
భారత పారా అథ్లెట్ల పట్టుదల, అంకితభావం, అజేయ స్ఫూర్తి 140 కోట్ల మంది భారతీయులకు ప్రేరణనిస్తున్నాయని, వారి పట్ల దేశం ఎంతో గర్విస్తోందని ప్రధానమంత్రి అన్నారు.
క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
“ ఐచి - నగోయాలో ప్రారంభమైన 2026 ఆసియా పారా క్రీడల్లో పాల్గొంటున్న భారత బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన పారా అథ్లెట్ల పట్ల భారతదేశం ఎంతో గర్విస్తోంది. వారి పట్టుదల, అంకితభావం, అజేయ స్ఫూర్తి 140 కోట్ల మంది భారతీయులకు ప్రేరణనిస్తున్నాయి. క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో పోటీపడి తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2324959)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8