బొగ్గు మంత్రిత్వ శాఖ
2027 ఫిబ్రవరి 24 నుంచి 26 తేదీలకు ఇండియా మైనింగ్ వీక్ షెడ్యూల్ మార్పు
నాడు పోస్టు చేయడమైనది:
16 OCT 2026 3:10PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో 2027 ఫిబ్రవరి 24 నుంచి 26 తేదీల్లో ఇండియా మైనింగ్ వీక్ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ముందుగా నిర్ణయించిన నవంబర్ 15 నుంచి 17, 2026 తేదీలను మార్చారు.
పరిశ్రమ భాగస్వాములు, ప్రదర్శనకారులు, వక్తలు, ప్రభుత్వ వర్గాలతో జరిపిన సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇతర ప్రధాన పారిశ్రామిక, ప్రభుత్వ కార్యక్రమాలు ఒకే తేదీల్లో జరగకుండా ఉండేలా వివిధ మంత్రిత్వశాఖలు, పీఎస్ యూలు, అంతర్జాతీయ ప్రతినిధులు అత్యధిక సంఖ్యలో పాల్గొనేలా చూసేందుకు ఈ మార్చిన తేదీలు దోహదపడతాయి. పండుగలు, శీతాకాలంలో ప్రయాణాల సమయాన్ని తగ్గిస్తుంది. తద్వారా ప్రతినిధులు, అంతర్జాతీయ సందర్శకులు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.
పాల్గొనేవారికి ముఖ్య సమాచారం
· అన్ని రిజిస్ట్రేషన్లు, ఎగ్జిబిటర్ బుకింగులు, స్పాన్సర్షిప్ ఒప్పందాలు ఆటోమేటిక్గా కొత్త తేదీలకు బదిలీ అవుతాయి.
· కొత్త తేదీల్లో హాజరుకాలేని ప్రతినిధులు, ప్రదర్శనకారులు ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించేందుకు ఇండియా మైనింగ్ వీక్ బృందాన్ని సంప్రదించవచ్చు.
· తదుపరి ప్రకటన వెలువడే వరకు కార్యక్రమ వేదిక, ఇతివృత్తాలు, నిర్వహణకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి మార్పు ఉండదు.
· సవరించిన షెడ్యూళ్లు, వక్తల ప్రకటనలు, ఇతర వివరాలను ఇండియా మైనింగ్ వీక్ అధికారిక వెబ్సైట్లోనూ, అధికారిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తారు.
దేశ గనుల రంగ భవిష్యత్తుపై చర్చించేందుకు... మైనింగ్ కంపెనీలు, పరికరాలు, సాంకేతికతను అందించే సంస్థలు, విధాననిర్ణేతలు, పెట్టుబడిదారులు, పరిశ్రమ నిపుణులను ఇండియా మైనింగ్ వీక్ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. ఎగ్జిబిషన్, సదస్సు, బిజినెస్ నెట్వర్కింగ్ సెషన్ల ద్వారా గనుల రంగం విలువ వ్యవస్థ వ్యాప్తంగా ఉన్న నూతన సాంకేతికతలు, సుస్థిర పద్ధతులు, పెట్టుబడి అవకాశాలను ఈ ప్రతిష్ఠాత్మక మైనింగ్ కార్యక్రమం ప్రదర్శిస్తుంది.
****
(రిలీజ్ ఐడి: 2324575)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9