బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక ప్రచార కార్యక్రమం-6 ద్వారా డిజిటల్ పాలన, సేవల పంపిణీని బలోపేతం చేస్తున్న ఎస్ఈసీఎల్


ఆరోగ్య సంరక్షణ, పెన్షన్ సంబంధిత సేవల మెరుగుదలకు హెచ్ఎంఐఎస్, పీపీఓ, జీవన్ ప్రమాణ్ పత్ర పోర్టల్

నాడు పోస్టు చేయడమైనది: 16 OCT 2026 3:28PM by PIB Hyderabad

కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ పరిధిలోని కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్), హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్), పీపీఓ, జీవన్ ప్రమాణ్ పత్ర పోర్టల్ ద్వారా డిజిటల్ పాలనను, పౌర కేంద్రీకృత సేవల పంపిణీని మరింత బలోపేతం చేస్తోంది. సులభతర సేవల లభ్యత, పరిపాలనా సామర్థ్యం, పారదర్శకత, కాగిత రహిత పాలనను ప్రోత్సహించే ప్రత్యేక ప్రచార కార్యక్రమం-6 లక్ష్యాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలున్నాయి.

హెచ్ఎంఐఎస్: వైద్యారోగ్య సేవల క్రమబద్ధీకరణ

వైద్యారోగ్య సేవల నిర్వహణకు సమగ్ర డిజిటల్ వేదికను ఎస్ఈసీఎల్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) అందిస్తుంది. రోగుల రిజిస్ట్రేషన్, వైద్య సంప్రదింపులు, చికిత్స, మందులకు సంబంధించిన సమాచారాన్ని డిజిటల్ రూపంలో నమోదు చేయటానికి ఈ వ్యవస్థ వీలు కల్పిస్తుంది. తద్వారా వైద్య రికార్డులను పద్ధతి ప్రకారం నిర్వహించటం, రోగుల గత వైద్య చికిత్సల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

అమృత్ ఫార్మసీ, మందుల నిర్వహణ అనుసంధానంతో పాటు.. మెడికల్ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్స్ ను ఆన్‌లైన్‌లో ప్రాసెస్ చేయటం కూడా హెచ్ఎంఐఎస్ వెసులుబాటు కల్పిస్తుంది. ఇది కాగిత రహిత పనిని ప్రోత్సహించేందుకు, పరిపాలనా ప్రక్రియలను క్రమబద్ధీకరించేందుకు, వైద్యారోగ్య సేవల పంపిణీని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది.

పీపీఓ, జీవన్ ప్రమాణ్ పత్ర పోర్టల్: పెన్షనర్లకు సులభతర సేవలు

పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, మరణించిన ఉద్యోగుల జీవిత భాగస్వాముల కోసం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ల (పీపీఓల) పంపిణీని డిజిటలైజ్ చేయటానికి, వార్షిక జీవన ప్రమాణ పత్రం సమర్పణను సులభతరం చేసేందుకు ఎస్ఈసీఎల్ సమగ్ర పీపీఓ, జీవన్ ప్రమాణ్ పత్ర పోర్టల్‌ను అభివృద్ధి చేసింది.

పెన్షనర్లు పీపీఓ పత్రాలను ఈ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో పొందవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వార్షిక జీవన ప్రమాణ పత్రాలను డిజిటల్ రూపంలో సమర్పించవచ్చు. స్వయంగా పత్రాల సమర్పణ, మాన్యువల్ ప్రక్రియలపై ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తుంది.

ఎస్ఈసీఎల్ కార్యకలాపాలు సాగించే అన్ని ప్రాంతాల్లో పీపీఓల అప్‌లోడ్, నిబంధనల అమలు పర్యవేక్షణకు సమగ్ర గవర్నెన్స్ డ్యాష్‌బోర్డ్ తోడ్పడుతుంది. ఇది పారదర్శకతను, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

డిజిటలైజేషన్ ద్వారా సుపరిపాలనకు ప్రోత్సాహం

పరిశుభ్రత, ఈ-వ్యర్థాల నిర్వహణ, స్థల సద్వినియోగం, రికార్డుల నిర్వహణ, పెండింగ్ పనుల తగ్గింపుపై 2026 అక్టోబర్ 2 నుంచి 31 వరకు జరిగే ప్రత్యేక ప్రచార కార్యక్రమం-6 అమలు దృష్టి సారిస్తుంది.

కాగిత రహిత పాలన, మెరుగైన సేవల లభ్యత, సమర్థవంతమైన రికార్డుల నిర్వహణ, వేగవంతమైన సేవల పంపిణీని ప్రోత్సహించటం ద్వారా ఎస్ఈసీఎల్ చేపట్టిన డిజిటల్ కార్యక్రమాలు ఈ లక్ష్యాలకు చేయూతనిస్తున్నాయి.

ఎస్ఈసీఎల్ డిజిటల్ పరివర్తనను, సుపరిపాలనను హెచ్ఎంఐఎస్, పీపీఓ, జీవన్ ప్రమాణ్ పత్ర పోర్టల్ ద్వారా ముందుకు తీసుకెళ్తూ.. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలకు అత్యవసర సేవలను మరింత అందుబాటులోకి, సౌకర్యవంతంగా మారుస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2324569) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil